Mahesh Babu: ప్రిన్స్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. అతడు ఇంకా ఖలేజా, ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్ మరోసారి జత కట్టనున్నారు.రీసెంట్ గానే త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేశాడు. రాజకీయ నేపథ్యంలో సాగే భారీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాని తీయాలనేదే త్రివిక్రమ్ ఆశ, తాపత్రయం. కానీ, త్రివిక్రమ్ కి పక్కా యాక్షన్ మూవీ వర్కౌట్ అవదు అనేది మహేష్ భయం.
కాకపోతే, త్రివిక్రమ్ మాత్రం ఈ సినిమాలో యాక్షన్ అండ్ రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావిస్తామని, ఇది యాక్షన్ సినిమా అయినప్పటికీ.. ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతుందని చెబుతున్నాడు. పైగా ఈ సినిమాలో రెండు బలమైన నేపథ్యాలు కూడా ఉంటాయట.ఢిల్లీలోని భిన్నమైన రాజకీయ నేపథ్యం ఒకటి కాగా, పలనాటి ప్రాంతానికి సంబంధించిన నేపథ్యం మరొకటి. మరి మహేష్ ఒప్పుకుంటాడా ? ఎలాగూ మాటలతో కన్విన్స్ చేయడం త్రివిక్రమ్ కి పెన్ తో పెట్టిన విద్య. మరి ఈ మాటల మాంత్రికుడు ఈసారి తన విద్యను ఎంతవరకు ప్రయోగిస్తాడో చూడాలి.
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కోసం త్రివిక్రమ్ ఓ కీలక పాత్రను రాశాడు.సంజయ్ ది పక్కా రాజకీయ నాయకుడి పాత్ర. అలాగే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారు. అందులో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ను తీసుకోవాలని చూస్తున్నట్లు త్రివిక్రమ్ సన్నిహితుల దగ్గర నుండి అందుతున్న సమాచారం. మరో కథానాయికగా పూజా హెగ్డేనే తీసుకుంటున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాకి బడ్జెట్ 250 కోట్లు అయ్యే అవకాశం కూడా ఉందట.
అసలుకే యాక్షన్ సినిమా.. త్రివిక్రమ్ కి సరిగ్గా సూట్ కానీ జోనర్. అందుకే, ఈ సినిమా బడ్జెట్ చూసి మహేషే ఆలోచనలో పడ్డాడు. మహేష్ బ్యానర్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతుంది. అందుకే, బడ్జెట్ గురించి మహేష్ వెనకాముందు ఆలోచిస్తున్నాడు. ఫైనల్ గా త్రివిక్రమ్ – మహేష్ లలో ఎవరు కాంప్రమైజ్ అవుతారో చూడాలి.