2020వ సంవత్సరంకి మరి కొద్ది రోజులలో గుడ్ బై చెప్పబోతున్నాం. కరోనాతోనే ఈ ఏడాది సగం రోజులు గడిచిపోయాయి. మిగతా రోజులలోను పెద్దగా చెప్పుకోదగ్గ అంశాలు ఏమి లేవు. ఏడాది మొదట్లో అల వైకుంఠపురములో , సరిలేరు నీకెవ్వరు చిత్రాలు సందడి చేయగా, చివరలో సాయిధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం ఎంటర్‌టైన్‌మెంట్ అందిచేందుకు సిద్ధం అయింది. అయితే 2020 సంవత్సరంకి ఎండ్ కార్డ్ పడుతున్న నేపథ్యంలో ఈ ఏడాదిని సోషల్ మీడియా రివైండ్ చేస్తుంది.
ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ట్విట్టర్ పలు క్యాటగిరీలలో ఎక్కువగా చర్చించుకున్న అంశాల గురించి ప్రస్తావించింది. ముఖ్యంగా మనదేశంలో మాట్లాడుకున్న సినిమాల జాబితాలని పరిశీలిస్తే దిల్ బెచారా, సూరరై పోట్రు, సరిలేరు నీకెవ్వరు ఉన్నాయి. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం దేశ వ్యాప్తంగా మాట్లాడుకున్న టాప్ 3 చిత్రాలలో స్థానం దక్కించుకోవడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కగా, రష్మిక మందాన కథానాయికగా నటించింది.
2020 సరిలేరు నీకెవ్వరు చిత్రం దుమ్ము రేపగా, 2019లో మహర్షి, 2018లో భరత్ అనే నేను సినిమాలు ఉన్నాయి.మూడు సంవత్సరాలు మహేష్ సినిమానే ట్విట్టర్‌లో ఎక్కువ ప్రస్థావనకు రావడం మహేష్ అభిమానులకి ఆనందాన్ని కలిగిస్తుంది. వచ్చే ఏడాది మహేష్ -పరశురాం కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సర్కార్ వారి పాట ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక స్పోర్ట్స్ విషయానికి వస్తే బయోబబుల్ వాతావరణంలో జరిగిన ఐపీఎల్ టాప్ వన్ లో ఉంది.