మహేష్, కొరటాల.. మళ్ళీ ఇలా కలుస్తున్నారు

Korata Shiva to work in Mega compund for next three years

టాలీవుడ్ లో డైరెక్టర్ హీరో కాంబినేషన్ పై రోజురోజుకు అంచనాల డోస్ గట్టిగానే పెరుగుతున్నాయి. ఒక విధంగా తమిళ్ లోనే ఈ సెంటిమెంట్ కు భారీ స్థాయిలో బజ్ క్రియేట్ అవుతుందని అంటారు. కానీ ఇప్పుడు అంతకంటే హై రేంజ్ ల్ తెలుగులో కూడా అంచనాల డోస్ పెరుగుతున్నాయి. త్వరలో మహేష్ బాబు, కొరటాల శివ మళ్ళీ ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే కొరటాల ఈ సారి దర్శకుడిగా చేయడం లేదు. ప్రస్తుతం ఈ దర్శకుడు మెగాస్టార్ ఆచార్య సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత వెంటనే అల్లు అర్జున్ ప్రాజెక్టును లైన్ లో పెట్టనున్నాడు. అయితే ఇప్పటికే మహేష్ బాబుతో రెండు సినిమాలు చేసి బాక్సాఫీస్ హిట్ కొట్టిన కొరటాల శివ ఈ సారి నిర్మాతగా సూపర్ స్టార్ తో సినిమా చేయనున్నాడట.

సర్కారు వారి పాట సినిమా స్క్రిప్ట్ విషయంలో కూడా కొరటాల శివ మహేష్ బాబుకు హెల్ప్ చేశారు. అయితే ఈ మధ్య యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల నుంచి ఒక కథను విన్న కొరటాల మళ్ళీ ఆ కథను కాస్త మార్పించి మహేష్ తో తెరకెక్కించాలని చూస్తున్నాడట. కథలో కమర్షియల్ ఎలిమెంట్స్ బలంగా ఉండడంతో తన ఫ్రెండ్ మిక్కిలినేని సుధాకర్ తో కలిసి సినిమాను నిర్మించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరి ఆ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో చూడాలి.