బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన మహేష్ హీరోయిన్… ఆ హీరోయిన్ కి తప్పని పోటీ?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు ఒకవైపు సినీ ఇండస్ట్రీలో ఉంటూనే మరోవైపు వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఈ విధంగా నటీనటులుగా వ్యాపారవేత్తలుగా రెండువైపుల మంచి గుర్తింపు సంపాదించుకుని రెండు చేతులా డబ్బు సంపాదిస్తున్నారు.ఈ క్రమంలోనే ఎంతోమంది హీరోహీరోయిన్లు ఇప్పటికే వ్యాపార రంగంలోకి అడుగు పెట్టే వారికంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టిన సంగతి మనకు తెలిసిందే. శరీర ఫిట్నెస్ గురించి ఎంతో శ్రద్ధ చూపించే రకుల్ ప్రీత్ సింగ్ ఎఫ్‌ 45 పేరుతో హైదరబాద్‌తో పాటు వైజాగ్‌ లో జిమ్ లను ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోని ఈ హీరోయిన్ కి పోటీగా మరో హీరోయిన్ జిమ్ సెంటర్ బిజినెస్ లోకి అడుగు పెట్టి రకుల్ ప్రీత్ సింగ్ కు గట్టి పోటీ ఇస్తున్నారు. మహేష్ బాబు సరసన నేనొక్కడినే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కృతిసనన్ గురించి అందరికీ సుపరిచితమే.ఈ సినిమా తరువాత మరో రెండు సినిమాలలో ఈమె తెలుగులో నటించిన ఈమెకు తెలుగులో పెద్దగా అదృష్టం కలిసి రాకపోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు వెళ్లారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో అగ్ర తారగా ఓ వెలుగు వెలుగుతున్న కృతిసనన్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే ఈమె ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతూనే మరోవైపు తన స్నేహితురాళ్లతో కలిసి జిమ్ సెంటర్ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టారు. స్వయంగా గా కృతిసనన్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ…అనుష్క నందానీ, కరణ్‌ సాహ్నీ, రాబిన్‌ బెహ్ల్‌లతో కలిసి ఒక వ్యాపారవేత్తగా ది ట్రైబ్‌ను లాంచ్‌ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందనీ వెల్లడించారు. ఇకపోతే ఈమె ప్రభాస్ సరసన ఆది పురుష్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.