హీరోగా తెరంగేట్రానికి సిద్ధమవుతున్న మహేష్‌బాబు తనయుడు.!

నటుడిగా ఎప్పుడో తెరంగేట్రం చేసేశాడు సూపర్ స్టార్ మహేష్‌బాబు తనయుడు గౌతమ్. మహేష్ నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమాలో చిన్నప్పటి మహేష్ పాత్రలో గౌతమ్ ఒదిగిపోయిన సంగతి తెలిసిందే. మహేష్ కూడా తొలుత బాల నటుడిగానే తెరంగేట్రం చేశాడు. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించాడు కూడా.

ఇక, గౌతమ్ హీరోగా ఎప్పుడు తెరంగేట్రం చేస్తాడు.? అని మహేష్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కొన్ని పిక్స్‌లో మహేష్‌తో సమానంగా కనిపిస్తున్నాడు గౌతమ్. దాంతో, సహజంగానే హీరోగా గౌతమ్ ఎప్పుడు తెరంగేట్రం చేస్తాడన్న ప్రశ్న తెరపైకొస్తోంది. కాగా, కుమారుడి తెరంగేట్రంపై మహేష్‌కి తొందరేమీ లేకపోయినా, మహేష్ సతీమణి నమ్రత మాత్రం తన కుమారుడ్ని తెరపై చూసుకోవడానికి ఉబలాటపడుతోందిట.

అన్నీ అనుకున్నట్టు జరిగితే, గౌతమ్ ప్రధాన పాత్రలో ఓ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. మహేష్‌కి అత్యంత సన్నిహితుడైన స్టైలిష్ డైరెక్టర్ ఒకరు, గౌతమ్ కోసం ఓ సినిమా రెడీ చేశాడట. అయితే ‘హీరోయిజం’ అనే కోణంలో కాకుండా, గౌతమ్‌లోని నటుడ్ని వెలికి తీసేలా ఈ సినిమా వుండబోతోందని సమాచారమ్.