Mahesh Babu : ఉగాది పర్వదినాన మాస్ లుక్ లో అదరగొడుతున్న మహేష్ బాబు..!

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు పరశురామ్ తో తీస్తున్న సినిమా సర్కారు వారి పాట. భరత్ అను నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వంటి హ్యాట్రిక్ విజయం తర్వాత వస్తున్న స్టార్ సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా మీద అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, టీజర్ కు విశేష స్పందన లభించింది. ఇక సినిమా నుంచి వచ్చిన కళావతి సాంగ్ యూట్యూబ్ లో 12 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మధ్య సీతార తో చేసిన ‘పెన్నీ’ సాంగ్ మ్యూజిక్ వీడియో అయితే పెద్ద సెన్సేషనల్ గా మారింది.

అయితే తాజాగా ఉగాది పండుగ సందర్భంగా మిత్ర బంధం సినిమా కి సంబంధించిన పోస్టర్ని ఆవిష్కరించారు.ఇందులో చెక్డ్ షర్ట్ ఇంకా అలాగే బ్లాక్ జీన్స్ ధరించిన మహేష్ బాబు బీచ్ లో ఫైట్ కు సిద్ధమవుతున్నాడు. స్టైలిష్ గా చాలా ఇంటెన్స్ గా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ లో మహేష్ బాబు లుక్ అభిమానులు ఎంతగానో ఆకట్టుకుంటోంది.మహేష్ బాబు తన బెల్టును బిగించి యాక్షన్ కోసం రెడీగా ఉండడం చూస్తుంటే ఇదొక హై వోల్టేజ్ యాక్షన్ సీన్ అని అర్థం అవుతోంది. రామ్ – లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ ఈ ఫైట్ ను డిజైన్ చేశారు. ఉగాది పండగకి అభిమానులకు సూపర్ సార్ ఇచ్చిన ఒక్క మాస్ ట్రీట్ అని చెప్పవచ్చు.. మహేష్ బాబు ఏ సినిమాలో హెయిర్ స్టైల్ ఇంకా మేడ మీద రూపాయి కాయిన్ తో అలాగే సినిమా నుంచి పాటలు పోస్టర్ల ద్వారా సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు.

ఈ సినిమాలో మహేష్ బాబు కి జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్, మహేష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సముద్రఖని, వెన్నెల కిషోర్, సుబ్బరాజు కీలక పాత్రలో నటిస్తున్నారు.