Mahesh Babu : ప్రతిసారి మహేష్ సినిమాకు అడ్డొస్తున్న హాలీవుడ్.. ఈసారి ఏ సినిమా అడ్డం వస్తోంది….!

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు పరశురామ్ తో తీస్తున్న సినిమా సర్కారు వారి పాట. భరత్ అను నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వంటి హ్యాట్రిక్ విజయం తర్వాత వస్తున్న స్టార్ సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా మీద అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.ఈ చిత్రంలో మహేష్ కి జోడిగా మహానటి ఫెమ్ కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ 14 ప్లస్ రీల్స్ జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పరుశురామ్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా గత కొన్ని నెలలుగా ఆలస్యమవుతూ వచ్చిన ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తరువాత మహేష్ నుంచి రానున్న చిత్రం కావడం పైగా ఈ సినిమా ‘పోకిరి’వైబ్స్ ని కలిగిస్తోందరని స్వయంగా హీరో మహేష్ బాబు చెప్పడంతో ఫ్యాన్స్ ఈ చిత్రం విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, టీజర్ కు విశేష స్పందన లభించింది. ఇక సినిమా నుంచి వచ్చిన కళావతి సాంగ్ యూట్యూబ్ లో 12 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మధ్య సీతార తో చేసిన ‘పెన్నీ’ సాంగ్ మ్యూజిక్ వీడియో అయితే పెద్ద సెన్సేషనల్ గా మారింది.ఐతే ఈ సినిమా ని మే 12 న విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.ఐతే అనుకున్న రోజుకి ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు కనిపించట్లేదు.కారణం మహేష్ కు ఇటీవల మైనర్ ఆపరేషన్ జరిగింది. కొన్ని రోజులు దుబాయ్ లో విశ్రాంతి తీసుకున్నారు కూడా.దీంతో షూటింగ్ ఆలస్యం అయింది, పైగా సినిమాకు సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఉండడటం తో సినిమా ను మే ఆఖరికి విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదిలా వుంటే మే 12న వస్తే మహేష్ సినిమాకు మర్వెల్ సినిమా ‘డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవెర్స్ ఆఫ్ మ్యాడ్నెస్’ విడుదల కాబోతోంది.యుఎస్ లో ఈ సినిమా మే 6న రిలీజ్ కాబోతోంది. ఆ తరువాతే ఇండియాలో విడుదల కానుంది. గతంలో ‘భరత్ అనే నేను’ మూవి టైమ్ లో ‘అవెంజర్స్ ఇన్ఫినిటీవార్’ విడుదలై మహేష్ మూవీకి భారీ పోటీనిచ్చింది. ఆ తరువాత ‘మహర్షి’ టైమ్ లో ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ విడుదలై మరింత దెబ్బకొట్టింది.ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ విడుదల టైమ్ లోనూ ఇదే మార్వెల్ యూనివర్స్ నుంచి వస్తున్న ‘డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవెర్స్ ఆఫ్ మ్యాడ్నెస్’ భారీ పోటీని ఇవ్వబోతోంది. మార్వెల్ వరల్డ్ మూవీస్ కి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ వున్న విషయం తెలిసిందే. ఆ కారణంగా యుఎస్ లో ఈ సినిమాకి అత్యధిక థియేటర్లని కేటాయిస్తారు. అది ‘సర్కారు వారి పాట’కు ప్రధాన సమస్యగా మారే అవకాశం వుందట.