అడ్డు లేకుండా దూసుకెళ్లండి.. మహేష్ బాబు వీడియో వైరల్

Mahesh babu Workout Video goes viral

సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో మరీ అంత యాక్టివ్‌గా ఏమీ ఉండడు. అవసరైమనప్పుడు మాత్రమే స్పందిస్తుంటాడు. ఫోటోలు, వీడియోలు కూడా అంతగా షేర్ చేయడు. కానీ కొన్ని సందర్భాల్లో మహేష్ బాబు కూడా అదిరిపోయే కొటేషన్ల‌తో వీడియోలు షేర్ చేసి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతాడు. మహేష్ బాబు ఎక్కువగా ఫిట్ నెస్‌కు ప్రాధాన్యమిస్తుంటాడు. ఆ మధ్య మహేష్ బాబు తన ఇష్టానికి అనుగుణంగా ఓ లగ్జరీ జిమ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. అందులో మహేష్ బాబు క్రమం తప్పకుండా వర్కవుట్ చేసేవాడు.

Mahesh babu Workout Video goes viral
Mahesh babu Workout Video goes viral

లాక్డౌన్‌లో మహేష్ బాబు జిమ్ ఏరియాలో కష్టపడుతున్న వీడియోలను నమ్రత స్పెషల్‌గా షేర్ చేసింది. మహేష్ బాబు నిర్మించుకున్న లగ్జరీ జిమ్ విశేషాలను చెబుతూ ఆ మధ్య షేర్ చేసిన వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు మహేష్ బాబు ఓ వీడియోను షేర్ చేశాడు. అయితే అది ఎక్కడన్నది మాత్రం తెలియడం లేదు. రెండ్రోజుల క్రితమే మహేష్ బాబు ముంబైకి వెళ్తున్నాడని నమ్రత షేర్ చేసింది. కానీ మహేష్ బాబు మాత్రం ఇప్పుడు ఓ వర్కవుట్ వీడియోను షేర్ చేశాడు.

అయితే తాజాగా మహేష్ బాబు తన వర్కవుట్ వీడియోను షేర్ చేయగా అది వైరల్ అవుతోంది. ఇందులో మహేష్ బాబు హెయిర్ స్టైల్ అదిరిపోయింది. ఎంతో చెమటోడ్చుతూ తెగ కష్టపడుతున్నాడు. మీ ఆటను రైజ్ చేయండి.. ఇంకా పైకి లేవండి.. హద్దులు లేవని గుర్తించండి. . ఎవ్వరూ ఆపరేనంతగా దూసుకువెళ్లండి అని అభిమానుల్లో ఉత్సాహాని పెంచాడు. అయితే బ్యాక్ గ్రౌండ్‌ను పరిశీలిస్తే మహేష్ బాబు హైద్రాబాద్‌లోని తన ఇంట్లో ఉన్న జిమ్ ఏరియాలోనే ఉన్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి మహేష్ ఫిట్ నెస్ మాత్రం కేక అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.