ఇందిరా దేవి చివరి కోరిక తీర్చలేకపోయిన మహేష్ బాబు..ఆ కోరిక ఏంటో తెలుసా..?

ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీల మరణాలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. కృష్ణంరాజు మరణం నుండి తేరుకోకముందే సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి మరణం ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. చాలాకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇందిరాదేవి వీల్ చైర్ కి పరిమితం అయింది. ఇటీవల ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిద్రలోని తుది శ్వాస విడిచింది.

కృష్ణ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల మహేష్ బాబు చిన్ననాటి నుండి తన తల్లితో ఎక్కువ చనువుగా ఉంటూ తల్లి చాటు బిడ్డగా పెరిగాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగినా కూడా మహేష్ బాబు తన తల్లితో ఎంతో చనువుగా ఉండేవాడు. తనకు ఏదైనా బాధ కలిగినప్పుడు లేదా సినిమా రిలీజ్ అవ్వటానికి ముందు తన తల్లి చేతితో తయారు చేసిన కాఫీ తాగి రిలాక్స్ అయ్యేవాడు. అయితే ఇలా అనారోగ్యంతో తల్లి మరణించడంతో మహేష్ బాబు ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు.

అంతేకాకుండా అనారోగ్యంతో బాధపడుతూ మహేష్ బాబు తల్లి కోరిన చివరి కోరికను కూడా తాను నెరవేర్చలేకపోయానని మహేష్ బాబు మరింత కుమిలిపోతున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి తన మనవరాలు సితారకి ఓణీల ఫంక్షన్ చేయమని కోరగా అటువంటి కార్యక్రమాలు ఇష్టం లేని మహేష్ బాబు మాత్రం అప్పుడు ఇప్పుడు అంటూ తన తల్లి కోరికను తీర్చకుండా వాయిదా వేస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు తల్లి మరణించిన తర్వాత కోరిక తీర్చలేక పోయానని బాధతో కుమిలిపోతున్నాడని సమాచారం.