టాలీవుడ్ క్యూట్ కపుల్స్ లిస్ట్ తీస్తే అందులో ముందు వరుసలో ఉండేది మాత్రం మహేష్ బాబు నమ్రజ జంటే. ప్రేమ వివాహాం చేసుకున్న ఈ జంట టాలీవుడ్ మొత్తాన్ని ఆకర్షించింది. వంశీ సినిమాతో మొదలైన వీరి ప్రయాణం నేటికి ఎంతో అన్యోన్యంగా కొనసాగుతోంది. బాలీవుడ్ హీరోయిన్ అయినా కూడా మహేష్ బాబును వివాహాం చేసుకున్నాని తెలుగింటి కోడలిగానే మారిపోయింది. మహేష్ బాబుకు అన్ని విధాల తోడుగా ఉంటూ ఇంటిని చక్కబెట్టింది. మహేష్ వ్యవహారాలన్నీ కూడా నమ్రత దగ్గరుండి చూసుకుంటుంది.
మహేష్ సినిమాలు, వ్యాపారాలు, ఆదాయాలు, ఫిట్ నెస్ ఇలా ప్రతీ ఒక్క విషయంలో నమ్రతే బ్యాక్ బోన్. అలా దగ్గరుండి భర్త ఎదుగుదలకు తోడ్పడుతోంది. ఇక ఇంటిని, పిల్లలను జాగ్రత్త చూసుకుంటూ ఆదర్శ గృహిణిగా నిలిచింది. మహేష్ బాబు గురించి తెలియాలంటే నమ్రత సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వాల్సిందే. మహేష్ బాబు చేసే అల్లరి, పిల్లలతో కలిసి చేసే సందడిని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటుంది. అయితే మహేష్ బాబు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని విషయాలను పంచుకుంటాడు.
డాటర్స్ డే, వుమెన్స్ డే అంటూ వచ్చే ప్రత్యకమైనసందర్భాల్లో మహేష్ బాబు స్పందిస్తాడు. ఇక నమ్రత బర్త్ డే అంటే మాత్రం మహేష్ బాబు తనలోని భావాలను బయటకు పెట్టేస్తాడు. నేటి నమ్రత బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు ఆపై ప్రేమను కురపించాడు. నేనే ప్రేమించే వ్యక్తి ఈ రోజు పుట్టింది.. నీతో ఉంటే ప్రతీ రోజూ ప్రత్యేకంగానే ఉంటుంది.. అయితే ఈ రోజు మాత్రం ఇంకొంచెం ఎక్కువ ప్రత్యేకం.. అద్భుతమైన మహిళ బర్త్ డేను సెలెబ్రేట్ చేస్తున్నాను.. హ్యాపీ బర్త్ డే బాస్ లేడీ అంటూ అదిరిపోయే ఫోటోను షేర్ చేశాడు. ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యామిలీ దుబాయ్‌లో ఉందన్న సంగతి తెలిసిందే.