రెస్ట్ అండ్ రీచార్జ్ అంటూ సూపర్ సెల్ఫీ షేర్ చేసిన మహేష్ బాబు.. ప్రిన్స్ లుక్ కి ఫిదా అవుతున్న ఫ్యాన్స్?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పనులతో ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు పూర్తిగా తన లుక్ చేంజ్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో ఈయన లైట్ గా గడ్డం మీసాలుతో కనిపించనున్నట్లు గత కొన్ని రోజులుగా ఈ లుక్ లో ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కోసం మహేష్ బాబు లుక్ ప్రతి ఒక్క అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పాలి.ఇలా వరుస ఫోటో షూట్లతో ఎన్నో ఫోటోలను షేర్ చేసిన మహేష్ బాబు తాజాగా ఒక సూపర్ సెల్ఫీ నీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులకు షాక్ ఇచ్చారు.ఈ సందర్భంగా ఈయన లైట్ స్కై బ్లూ కలర్ టీ షర్ట్ ధరించి సెల్ఫీకి ఫోజులిచ్చారు.ఈ క్రమంలోనే ఈ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ రెస్ట్ అండ్ రీచార్జ్ అనే క్యాప్షన్ పెట్టారు.

ప్రస్తుతం మహేష్ బాబు షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఈ ఫోటో చూసి ఫీదా అవుతున్నారు.మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా కోసం ఇలాంటి లుక్ ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలను కూడా పెంచేసాయి.దాదాపు 12 సంవత్సరాల తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్లో ఈ సినిమా రావడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు సైతం ప్రేక్షకులను సందడి చేశాయి. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే.