Mahesh Babu: ఉమెన్స్ డే స్పెషల్…. స్పెషల్ ఫోటోని షేర్ చేసిన మహేష్ బాబు… ఫోటో వైరల్!

Mahesh Babu: మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావడంతో ప్రతి ఒక్కరు మహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్నో రకాల పోస్టులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోలు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి విషయంలో వారి విజయం వెనుక ఉన్న మహిళల గురించి చెప్పుకొస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి తన విజయానికి కారణం సురేఖ అంటూ వెల్లడించారు. అలాగే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు సైతం తన జీవితంలో ముగ్గురు మహిళలకు ఎంతో ప్రత్యేకత ఉందని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

మహిళా దినోత్సవం సందర్భంగా మహేష్ బాబు తన తల్లి ఇందిరా, తన భార్య నమ్రత అలాగే తన కూతురు సితార ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ… గ్రిట్ మరియు దయ, అందం, ప్రకాశం కోసం, జాలి దయ స్థితిస్థాపకతకు కారణం మహిళలందరూ లోనీ మార్పు అంటూ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహేష్ బాబు తన తల్లి భార్య కూతురు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన మహేష్ బాబు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఇదిలా ఉండగా మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ఈయన పరశురామ్ దర్శకత్వంలో సర్కారీ వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ప్రస్తుతం షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.