మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ మొదలు ..!

మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ మొదలైందని తాజా సమాచారం. కరోనా కారణంగా ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన సర్కారు వారి పాట ఎట్టకేలకి చిత్రీకరణ ప్రారంభించారు. అయితే ముందు నుంచి అనుకుంటున్నట్టుగా అమెరికా.. హైదరాబాద్ లో కాకుండా దుబాయ్ లో షెడ్యూల్ ప్లాన్ చేయడమే ఇప్పుడు అందరికీ షాకింగ్ గాను … ఆసక్తికరంగాను మారింది. రీసెంట్ గా మహేష్ ఫ్యామిలీ తో సహా విదేశాలకి వెళ్ళాడు. తన సతీమణి బర్త్ డే సెలబ్రేషన్స్ కూడా విదేశాలలోనే జరిపాడు. అయితే చిన్న ఫ్యామిలీ ట్రిప్ అని అందరూ భా వించారు.

కాని మహేష్ ప్లాన్ రెండు రకాలుగా చేశాడని తాజాగా సర్కారు వారి పాట నుంచి అప్‌డేట్ రావడం తో క్లారిటీ వచ్చింది. ఈ రోజు నుంచి మహేష్ బాబు సర్కారు వారి పాట సెట్స్ మీద రాగా.. నెలరోజులు ఈ షెడ్యూల్ కొనసాగుతుందట. దుబాయ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని ఇండియా తిరిగి వచ్చాక ఇక్కడ ప్రత్యేకంగా నిర్మించిన బ్యాంక్ సెట్ లో నెలరోజుల పాటు చిత్రీకరణ సాగిస్తారని సమాచారం. కాగా తాజాగా దుబాయ్ లో మొదలు పెట్టిన షెడ్యూల్ లో మహేష్- కీర్తి సురేష్ పై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారట. మేకర్స్ ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు.

గీత గోవిందం తర్వాత లాంగ్ గ్యాప్ వచ్చిన పరశురాం సర్కారు వారి పాట కి దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ – 14 రీల్స్ ప్లస్ బ్యానర్లు- జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే సర్కారు వారి పాట టైటిల్ తో పాటు మహేష్ బాబు లుక్ కి విపరీతమైన స్పందన వచ్చింది.. కాగా బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న అవినీతి బ్యాక్ డ్రాప్ లో సినిమా తెరకెక్కుతోంది. విజయదశమి భారీ స్థాయిలో సర్కారు వారి పాట ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.