ఇది మామూలు క్రేజ్ కాదు.. రిలీజ్‌కు ముందే మహేష్ బాబు సరికొత్త రికార్డ్‌

Mahesh babu sarkaru Vaari paata New record On Twitter

మామూలుగా మహేష్ బాబు సినిమాలంటే బాక్సాఫీస్‌కు వణుకు పుడుతుంది. వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతూ దూసుకుపోతున్నాడు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి వంటి చిత్రాలతో మహేష్ బాబు ఇండస్ట్రీ హిట్లు కొట్టేశాడు. రెండు వందల కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టేశాడు. ఇక చివరగా సరిలేరు నీకెవ్వరు అనే చిత్రంతో మరోసారి మాస్ పవర్ ఏంటో నిరూపించాడు. ఈ మూవీ కూడా రెండు వందల కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది.

Mahesh babu sarkaru Vaari paata New record On Twitter
Mahesh babu sarkaru Vaari paata New record On Twitter

అలా వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతున్న మహేష్ బాబు ఈ మధ్య సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులు కొల్లగొడుతున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. మహేష్ బాబు ఉన్నంత ఫాలోయింగ్ మరే సౌత్ హీరోకు కూడా లేదు. మహేష్ బాబే సోషల్ మీడియాలో ఆధిపత్యం చెలాయిస్తుంటాడు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ దెబ్బకు రికార్డులన్నీ ఖతమవ్వాల్సిందే. తాజాగా మహేష్ బాబు ఖాతాలో మరో రికార్డు పడింది.

విడుదలకు ముందే సర్కారు వారి పాట సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఈ సినిమాపై వంద మిలియన్ల ట్వీట్లు పడ్డాయట. విడుదలకు ముందే ఇలా ఓ సినిమాపై ఇన్ని మిలియన్ల ట్వీట్లు పడటం ఇదేమొదటి సారి అని తెలుస్తోంది. మొత్తానికి మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజ్‌లో రచ్చ చేశారు. సర్కారు వారి పాట పలు సందర్భాల్లో నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అయింది. విడుదలకు ముందే ఈ సినిమా ఇలా రికార్డులు క్రియేట్ చేస్తుంటే సినిమా రిలీజ్ అయితే ఇంకెలా ఉంటుందో అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.