“గుంటూరు కారం” లో ఆమె రోల్ చెప్పేసిన మహేష్ బాబు.!

టాలీవుడ్ సినిమాలో ఓ హీరోయిన్ కి తాను పరిచయం అయ్యిన కొన్నాళ్లలోనే సూపర్ క్రేజ్ వచ్చింది అంటే అది వారి అదృష్టం అని చెప్పాలి. కాగా ఆ అదృష్టాన్ని వారు ఎలా మలచుకుంటారు అనేది ఇక వారి నిర్ణయాలపై ఆధారపడి ఉంటే ఇప్పుడు ఈ హీరోయిన్స్ లో ఒకామెగా నటి మీనాక్షి చౌదరి కూడా నిలుస్తుంది అని చెప్పాలి.

అయితే ఈమె మొదటి సినిమా ప్లాప్ అయినప్పటికీ చాలా మంది దృష్టి ఆకర్షించింది. దీనితో అలాగే సూపర్ స్టార్ మహేష్ సరసన “గుంటూరు కారం” ఓ నటించే ఛాన్స్ కొట్టేసింది. కాగా ఈమె ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ గా చేస్తుందా లేక శ్రీలీల కంటే చిన్న రోల్ నా అనేది తెలుసుకోడానికి చాలా టైం పట్టింది.

ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ శ్రీలీల మాత్రమే అయితే మీనాక్షి చౌదరి మాత్రం ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తుంది అని కన్ఫర్మ్ అయ్యింది. ఈ సినిమాలో మీనాక్షి చాలా కీలకమైన పాత్ర చేసింది అని తనకి ఉన్నది చిన్న రోల్ అని తెలిసి కూడా సినిమా ఒప్పుకున్నందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఆమెకి థాంక్స్ కూడా చెప్పాడు.
ఐతే ఈ సినిమాలో ఆమెది చిన్న పాత్రే అయినప్పటికీ మంచి ఇంపాక్ట్ ఉంటుంది అని కూడా తెలిపాడు. దీనితో మహేష్ బాబు మీనాక్షి చౌదరి లని ఓ జంటగా లేదా సాంగ్స్ లాంటి వాటిలో చూడాలి అనుకునేవారు అయితే కాస్త అంచనాలు తక్కువ పెట్టుకొని చూడాలని చెప్పాలి. ఇక ఈ సినిమాని దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించగా థమన్ సంగీతం అందించాడు.