Mahesh Babu:ఆంధ్రప్రదేశ్ లో సోమవారం సినిమా టిక్కెట్ల కు సంబంధించిన కొత్త జీవోను జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు దీని గురించి పెద్దగా ఎవరు వారి స్పందన తెలియ చేయలేదు.చిరంజీవి, ప్రభాస్ తప్పా ఇంకో స్టార్ హీరో గానీ, డైరెక్టర్లు గానీ స్పందించలేదు. రాజమౌళి,కొరటాల శివ కొంతమంది నిర్మాతలు టికెట్ల విషయంపై సీఎం జగన్ తో భేటీ అయ్యారు, కానీ కొత్త జీవో మీద పెద్దగా సంతృప్తి చెందినట్టుగా లేరు. ఇండస్ట్రీకి సంబంధించి హీరోలు దర్శకులు నిర్మాతలు ఎవరు ఈ విషయంపై స్పందించడం లేదు.
ఇదిలా ఉండగా మహేష్ బాబు మాత్రం చాలా ఆలస్యంగా స్పందించారు. కొత్త జీవో మీద సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మా బాధలు విని, వాటికి తగ్గట్టుగా ఈ కొత్త జీవో ఇచ్చినందుకు సీఎం జగన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మున్ముందు కూడా ఇలానే ఆరోగ్య కరమైన వాతావరణంలో ప్రభుత్వం, చిత్రపరిశ్రమ ఎంతో సమన్వయంతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను.. పేర్ని నాని గారికి థ్యాంక్స్ అని మహేష్ బాబు ట్వీట్ వేశాడు.
My heartfelt thanks to the CM of AP Sri @ysjagan garu for hearing our concerns and addressing them through the new G.O and revised ticket rates. 🙏🙏
We look forward to a mutually strong and healthy support between the govt. and the TFI in the days to come @perni_nani garu. 🙏
— Mahesh Babu (@urstrulyMahesh) March 8, 2022
ఇలా ఆలస్యంగా స్పందించినందుకు కూడా టాలీవుడ్ లో కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. కొత్తగా వచ్చిన జీవో మహేష్ బాబు కొత్తగా నచ్చలేదేమో అందుకే ఆలస్యంగా స్పందించారు అంటూ కొత్త చర్చలు వినిపిస్తున్నాయి.