Mahesh Babu : సర్కారు వారి పాట సినిమా నుంచి మాస్ సాంగ్ లీక్… అభిమానులకు మాస్ కిక్..!

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ప్రస్తుతం వస్తున్న సినిమా సర్కారు వారి పాట. మహేష్ బాబు నుంచి వచ్చిన సరిలేరు నీకెవ్వరు తర్వాత దాదాపు రెండేళ్ల గ్యాప్ తో వస్తున్న ఈ సినిమా మీద అభిమానుల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, 14రీల్స్, మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఫాన్స్ ను ఫుల్ ఖుష్ చేస్తోంది.

ఈ సినిమాకు తమన్ అందించిన సంగీతం అభిమానులను బాగా ఆకట్టుకుంది ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి పాట కళావతి యూ ట్యూబ్ రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. ఇక ఈ పాటలో మహేష్ బాబు వేసిన స్టెప్పులకు అందరూ ఫిదా అయిపోతున్నారు. దీని తర్వాత వచ్చిన పెన్నీ సాంగ్ కూడా అదరగొట్టింది అందులోనూ ఈ పాటలో మహేష్ బాబు కూతురు సితార మొదటిసారి సిల్వర్ స్క్రీన్ మీద కనిపించడంతో ఫాన్స్ ఆనందానికి హద్దులు లేవు. వీటి తర్వాత మూడవ పాట గా వచ్చిన టైటిల్ సాంగ్ కూడా అంచనాలను పెంచుతోంది.

అయితే ప్రస్తుతం సర్కార్ వారి పాట సినిమా నుంచి నాలుగవ పాట విడుదల చేయకముందే లీక్ అయింది. మహేష్ మహేష్ అనే సాగే అవుట్ అండ్ అవుట్ మాస్ మసాలా సాంగ్ లీక్ అవ్వడమే కాకుండా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సినిమా నుంచి పాట లీక్ అయ్యింది అన్న బాధ కన్నా ఈ పాట మంచి కిక్ ఇస్తుండటం తో అభిమానులు హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. ఈ పాట తో సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి అంటున్నారు అభిమానులు. ఇకపోతే ఈ సినిమాలోని మహేష్ బాబు లుక్ కూడా ఫ్యాన్స్ కు బాగా నచ్చింది. మే 12న విడుదలకానున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ తమిళ్, తెలుగు భాషల్లో విడుదల కాబోతోంది. మహేష్బాబు ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఖాయమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.