Mahesh Babu: మహేష్ బాబు సినిమాలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు.. అసలు విషయం ఏంటంటే?

Mahesh Babu: ప్రముఖ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి తెలియని వారు ఉండరు తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం హ్యాండ్సమ్ హీరోగా మహేష్ బాబు మొదటి స్థానంలో ఉన్నాడు. అయితే మహేష్ చిన్నప్పటి నుంచి ఆయన తండ్రిగారి సినిమాలలో నటించాడు. మొదటగా రాజకుమారుడు సినిమా తో హీరో గా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు.

ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పోకిరిలో అద్భుతమైన నటన చేసి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో అప్పట్లో ఇండస్ట్రీ హిట్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. కొన్ని రోజుల క్రితం సర్కారీ వారి పాట సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు హిట్ అందుకున్నాడు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక కొత్త సినిమా మొదలుపెట్టాడు.

ఈ సినిమాకు హీరోయిన్ గా పూజా హెగ్డే పేరును మాత్రమే ఇప్పటివరకు ఈ సినిమా టీం ప్రకటించింది. ఇక కొంతమంది నటీనటులను ఎంపిక చేయలేదు. అయితే మిగతా నటుల కోసం త్రివిక్రమ్ టీం అన్వేషణ చేస్తూనే ఉంది. ఎందుకంటే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తీయాలని, అందుకోసం మలయాళం, తమిళ, హిందీ నుండి నటులను తీసుకోవాలని చూస్తున్నారు. కానీ వీళ్ళు అనుకున్న నటులు ఎవరూ ప్రస్తుతం బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ ఇంకా ఆలస్యం అయ్యే లాగా ఉంది. ఇదిలా ఉంటే, ఈ సినిమా గురించి ఒక విషయం మహేష్ బాబు అభిమానులకి తెలిసిందని అంటున్నారు.

మహేష్ కొత్త సినిమాలో కలెక్షన్ కింగ్..

ఇందులో సీనియర్ మరియు విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలీదు కానీ, ఈ వార్తని మహేష్ అభిమానులు చర్చించుకుంటున్నట్టు తెలిసింది. మోహన్ బాబు కుటుంబానికి, మహేష్ తండ్రి కృష్ణ కుటుంబానికి మంచి సన్నిహిత సంబంధాలు వున్నాయి. అందుకని మోహన్ బాబు ని అప్రోచ్ అయితే ఆయన ఒప్పుకోవచ్చు అని అంటున్నారు.