కృష్ణా నదిలో కృష్ణ అస్థికలను కలిపిన మహేష్ బాబు..!

దివంగత నటుడు కృష్ణ ఈనెల 15వ తేదీ అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం తెలిసిందే. ఇలా ఈయన మరణించడంతో ఈయన అస్థికలను కృష్ణా నదితో పాటు దేశంలోని పవిత్రమైన నదులలో ఆయన అస్థికలను నిమజ్జనం చేస్తున్నారు. ఇందులో భాగంగానే మహేష్ బాబు నేడు విజయవాడలోని కృష్ణా నదిలో కృష్ణ అస్థికలను నిమజ్జనం చేశారు.తన తండ్రి అస్థికలను నిమజ్జనం చేయడం కోసం మహేష్ బాబు కుటుంబంతో సహా నేడు ఉదయం విజయవాడ చేరుకొని సాంప్రదాయ బద్ధంగా ఆ కార్యక్రమాలన్నింటిని పూర్తి చేశారు.

కృష్ణానది ఉండవల్లిలోని కరకట్ట మీద ఉన్న ధర్మ నిలయం వద్ద తన తండ్రి అస్థికలను నిమజ్జనం చేశారు. ఇలా సాంప్రదాయ బద్ధంగా కృష్ణ తన తండ్రి అంత్యక్రియలను కృష్ణా నదిలో కలిపి పలు పూజా కార్యక్రమాలను నిర్వహించారు.ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా కృష్ణ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.

నేడు ఉదయం మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ చేరుకున్నారు. మహేష్ బాబు వెంట తన బావలు గల్లా జయదేవ్, సుధీర్, తన చిన్నాన్న ఆదిశేషగిరిరావు, డైరెక్టర్ త్రివిక్రమ్ మెహర్ రమేష్ పలువురు మహేష్ బాబుతో కలిసి విజయవాడ చేరుకొని ఈ కార్యక్రమాలను పూర్తి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.