మహేష్ మార్చమంటున్నాడట.!

‘గుంటూరు కారం’ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలోని ఓ కాన్సెప్ట్ విషయంలో మహేష్ బాబు అసంతృప్తిగా వున్నాడట.

ఆ కాన్సెప్ట్ మార్చేయాలని గురూజీకి సూచిస్తున్నాడట. సినిమాకి అదో ఇంపార్టెంట్ బ్లాక్ అని తెలుస్తోంది. సో, ఆ బ్లాక్‌లో మార్పులు చేర్పులు చేయాలని మహేష్, త్రివిక్రమ్‌కి సూచిస్తున్నాడట.

మరి, గురూజీ ఏం చేస్తాడో చూడాలి మరి. ఈ ఇంపార్టెంట్ బ్లాక్‌కి సంబంధించిన షూటింగ్ ఈ నెలాఖరులో జరగనుందనీ సమాచారం. ఈ లోపే ఈ బ్లాక్‌కి సంబంధించిన మార్పుల విషయంలో టీమ్ అంతా కూర్చొని చర్చించి వీలైనంత త్వరగా ఫైనల్ డెసిషన్ తీసుకోబోతున్నారట.

చూస్తుంటే, ‘గుంటూరు కారం’ సినిమాని మహేష్ బాబు సీరియస్‌గా తీసుకున్నట్లే అనిపిస్తోంది. అసలే ఈ సినిమా చుట్టూ అనేక గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయ్. డే వన్ షూటింగ్ నుంచే రకరకాల నెగిటివిటీ చోటు చేసుకుంది. ఇప్పుడయితే, మొత్తానికి సినిమా అటకెక్కేసిందన్న ప్రచారం జోరందుకుంది.

ఈ నేపథ్యంలో తాజాగా బయటికొచ్చిన ఈ గాసిప్.. ఆ ప్రచారానికి చెక్ పెడుతుందేమో చూడాలిక.