కృష్ణ పరువు తీస్తున్న నరేష్.! మహేష్ అసహనం.!

సూపర్ స్టార్ కృష్ణ పరువు తీసేలా వెకిలి చేష్టలు చేస్తున్నాడు నరేష్. ‘మళ్లీ పెళ్లి’ అంటూ సినిమా చేసి, దాంట్లో సూపర్ స్టార్ కృష్ణ రోల్ పెట్టాడు.

చాలా ఛండాళంగా ఈ ప్రోమో రూపొందించాడు. కృష్ణ పరువు తీసేలా ఆయన క్యారెక్టర్‌నీ ఆ క్యారెక్టర్‌పై డైలాగుల్నీ రచించారు.

దాంతో, ఈ ట్రైలర్ మహేష్ అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు కొందరు, మహేష్ దృష్టికి తీసుకెళ్లారట ఇదే విషయాన్ని.

ట్రైలర్ చూశాకా, మహేష్ కూడా ఈ విషయంలో చాలా సీరియస్ అయ్యాడట. కానీ, ఏమీ చేయలేని పరిస్థితి. తండ్రి పరువు పోతున్నా మహేష్ ఇలా అచేతనావస్థలో వుండడాన్ని మహేష్  సన్నిహితుల్ని ఆశ్చర్యపరుస్తోంది. అసలు కృష్ణ మీద నరేష్‌కి ఎందుకింత పగ.?