బాబు వచ్చాడు.. గుంటూరు కారం మొదలయ్యేనా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈపాటికే సగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకోవాలి. కానీ ఇప్పటివరకు 30% షూటింగ్ కూడా పూర్తికాలేదు. సినిమా మొదలైనప్పుడు నుంచి రెండు మూడు సార్లు మహేష్ బాబు హాలిడేస్ కోసమని కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లిపోయాడు.

అంతేకాకుండా రకరకాల వాదనలతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. రీసెంట్ గా మహేష్ బాబు మరోసారి తన పుట్టినరోజు సందర్భంగా ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే మొత్తానికి ఇప్పుడు బాబు ఇండియాలో అడుగు పెట్టేసాడు. దీంతో సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతాడు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

మహేష్ బాబు ప్లాన్ ప్రకారమైతే ఈనెల 16వ తేదీ నుంచి గుంటూరు కారం సినిమా షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది. అయితే అంతకంటే ముందు సినిమా మొదటి పాటకు సంబంధించిన అప్డేట్ విషయంలో కూడా మహేష్ బాబు తన నిర్ణయాన్ని చెప్పాల్సి ఉంది. మహేష్ ఓకే చెబితే సాంగ్ ను విడుదల చేయాలి అని త్రివిక్రమ్ ఇద్దరు కూడా చాలా సిద్ధంగా ఉన్నారు.

కానీ ఇంతకుముందు విన్న ట్యూన్స్ మాత్రం మహేష్ బాబుకు అంతగా నచ్చలేదని తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఇండియాకు తిరిగి వచ్చిన మహేష్ ను మరుసటి రోజు త్రివిక్రమ్ ప్రత్యేకంగా కలవాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సినిమా షూటింగ్ అయితే 16వ తేదీన మొదలు కావచ్చు. ఇక అప్డేట్ విషయంలో కూడా ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.