మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అక్కినేని నాగ చైతన్య

మహేష్ బాబు టాలీవుడ్ లో స్టార్ హీరోగా వరసగ సక్సస్ లతో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా మహేష్ బాబు ఖాతాలో అన్ని భారీ కమర్షియల్ హిట్స్ నే చేర్చుకుంటున్నాడు. ఇందులో ఎక్కువగా యంగ్ డైరెక్టర్స్ తెరకెక్కించిన సినిమాలు కావడం విశేషం. ఇక అక్కినేని వారసుడు నాగ చైతన్య కూడా మజిలీ లాంటి భారీ సక్సస్ తర్వాత మనం ఫేం విక్రం కుమార్ తో తాజాగా క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. దిల్ రాజు ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.

Thank You: Akkineni Naga Chaitanya's new film with Vikram K Kumar starts  rolling on Dussehra | Telugu Movie News - Times of India

ఇంతవరకు బాగానే ఉన్నా మహేష్ బాబు ఫ్యాన్స్ కి ప్రెసిడెంట్ గా నాగ చైతన్య మారడం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు అటు మహేష్ బాబు ఫ్యాన్స్ లో ఇటు అక్కినేని ఫ్యాన్స్ లో ఈ విషయం గురించి ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయట. ఒక స్టార్ హీరో అభిమాన సంఘానికి మరొక స్టార్ హీరో ప్రెసిడెంట్ ఏంటీ అని షాక్ కి గురవుతున్నారట. అయితే ఇది నిజ జీవితంలో కాదని ఆరా తీయగ వెల్లడైంది. రీసెంట్ గా నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా కంప్లీట్ చేసి థాంక్యూ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Naga Chaitanya to have multiple heroines in Thank You

ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. కాగా ఈ సినిమా కథ రిత్యా నాగ చైతన్య .. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా నటిస్తున్నాడట. ఈ విషయం తెలిసి మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు నాగ చైతన్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ నటించబోతుందని సమాచారం. అలాగే మరో ఇద్దరు హీరోయిన్స్ కి అవకాశం ఉండగా త్వరలో ఆ ఇద్దరు హీరోయిన్స్ ని ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది