Mahesh Babu: సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఎంతోమంది సెలబ్రిటీలు రాజకీయాలలోకి కూడా వస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్న పలువురు రాజకీయాలలోకి వచ్చి ఇక్కడ కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకొని రాజకీయాల పరంగా ఉన్నత పదవులను అధిరోహిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుత యంగ్ హీరోలు కూడా రాజకీయాలలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అందుకొని రాజకీయాల్లోకి వచ్చే ప్రస్తుతం రాజకీయాలలో కూడా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు.
ఈ క్రమంలోనే మరో క్రేజీ హీరో మహేష్ బాబు సైతం రాజకీయాలలోకి వస్తారా అనే ప్రశ్నకు క్రేజీ సమాధానం చెప్పారు.మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాలో సీఎం రోల్ లో నటించి ఆ సినిమాతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే సైనికుడు సినిమా కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కినా ఈ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ సినిమా గురించి మహేష్ బాబు ప్రస్తావిస్తూ.. తాను నటించిన సైనికుడు మూవీ థియేటర్లో వారం రోజులు కూడా ఆడలేదు అలాంటిది రాజకీయాలలోకి వచ్చి అక్కడ సక్సెస్ అవ్వడం అంటే అంత సులువైన విషయం కాదు అంటూ ఈయన సైనికుడు సినిమా ద్వారా తాను రాజకీయాలలోకి రాలేనని చెప్పకనే చెప్పేశారు.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నారు ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఇక ఈ సినిమా ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న నేపథ్యంలోనే సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు కూడా ఏర్పడ్డాయి.