Thaman: సర్కారు వారి పాట సినిమా నుండి స్వీట్ ట్రీట్, సితార ఏం చేసిందో తెలుసా..?

Thaman: మహేష్ బాబు నటిస్తున్న కొత్త సినిమా సర్కారు వారి పాట. మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గ నటిస్తోంది. పరశురామ్ ఈ సినిమా కు దర్శకత్వం వహిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే విడుదలైన కళావతి పాట సంగీత మధ్యమాలలో ఎక్కువ వ్యూస్ సాధిస్తూ రికార్డ్స్ సృష్టిస్తోంది. ఇక ఈ సినిమా నుండి మరొక సింగల్ పాటను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

మార్చి 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సంగీత దర్శకుడు థమన్ ఈ విషయాన్నీ అపుడే ప్రకటించారు. అయితే ఇందులో ఒక స్వీట్ ట్రీట్ ను అందిస్తున్నారు థమన్. మహేష్ బాబు ముద్దుల తనయ సితార ఇందులో భాగం కానుంది. ఈ విషయాన్నీ థమన్ తన సామాజిక మద్యం ద్వారా తెలిపారు. సినిమా విజయం విషయం లో చిత్ర యూనిట్ చాలా కాన్పిడెంట్ గ ఉన్నారట.

సితార తన స్నేహితురాలితో కలిసి యూట్యూబ్ ఛానల్ కూడా నడిపింది. ఇక డిస్నీ ప్రిన్సెస్ తెలుగు అనువాదానికి తన గాత్రాన్ని కూడా ఇచ్చింది. ఇక ఇటీవలే కళావతి పాటకు అనీ మాస్టర్ తో కలిసి స్టెప్పులేసి శభాష్ అనిపించుకుంది. ఇక ఇపుడు తండ్రి నటిస్తున్న సినిమాలో పాలుపంచుకుంటోంది. ఇక సర్కారు వారి పాట సినిమా ను మే 12 న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది.