SSMB29:మహేష్ సాహస యాత్ర.. క్యారెక్టర్ పేరు ఇదేనా?

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్‌ అంటేనే సినీ ప్రేమికులలో భారీ అంచనాలు నెలకొంటాయి. RRRతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన రాజమౌళి, ఇప్పుడు మహేష్‌తో అంతకంటే గొప్ప SSMB29 సినిమాను రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇది కేవలం పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ మాత్రమే కాదు, పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కించనున్న సినిమా. మహేష్ కెరీర్‌లో ఇదే అతిపెద్ద సినిమా అవుతుందన్న మాట ఇప్పటికే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌ గా మారింది.

మరి ఈ చిత్రంలో మహేష్ పాత్ర ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటికే సినిమాలో మహేష్‌ పాత్రను అడ్వెంచరస్‌గా డిజైన్‌ చేశారని, ఇది పూర్తిగా యాక్షన్, మిస్టరీతో నిండిన పాత్ర అని టాక్. అంతే కాదు, ఈ సినిమా ప్రధానంగా అడవులు, పురాతన నిధుల వెతుకులాట నేపథ్యంలో నడుస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ మేరకు ఇండియాలోని ఒడిశా, కేరళ, ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో భారీ స్థాయిలో షూటింగ్ జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సినిమా కథలో మహేష్ పాత్రకు ‘రుద్ర’ అనే పేరు ఖరారు చేశారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. రాజమౌళి సినిమాల్లో పేర్లు వెనుక గంభీరమైన కథనాన్ని సూచిస్తాయి. బాహుబలిలో శివుడు, RRRలో రామ్, భీమ్ లాంటి పేర్లకు ఎంతటి ప్రాధాన్యత ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మహేష్ పాత్రకు ఇచ్చిన రుద్ర అనే పేరు కూడా అలాంటి డెప్త్‌ కలిగినదే కావొచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పాత్ర ఒక మైథలాజికల్ కాన్సెప్ట్‌తో ముడిపడిందా లేక నిజ జీవితానికి దగ్గరగా ఉన్నదా? అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇంకా రాకపోయినా, లీకులు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. 1000 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా, అత్యంత గ్రాండ్ విజువల్ ఎఫెక్ట్స్, ఇంటర్నేషనల్ స్థాయి టెక్నాలజీని ఉపయోగించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. సినిమా పూర్తి వివరాలు బయటకొచ్చేంతవరకు ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంటుంది.

తోడల్లుళ్లు - అన్నచెల్లెలు || Chandrababu, Venkateswara Rao Come Together After 3 Decades || TR