మహేష్ బాబు-నమ్రత జోడి గురించి ఎంత చెప్పినా తక్కువే. వంశీ సినిమాతో ప్రేమాయణం మొదలై పెళ్లిగా మారి నేటికీ అంతే అన్యోన్యంగా జీవిస్తున్నారు. టాలీవుడ్ క్యూట్ కపుల్స్లో ప్రత్యేకంగా నిలిచారు. మహేష్ బాబు ప్రతీ విషయాన్ని దగ్గరుండి మరీ చూసుకుంటుంది. సినిమాల్లో అయినా, వ్యాపారంలో అయినా మహేష్ బాబు సక్సెస్ అయ్యాడంటే అందులో నమ్రత పాత్ర కూడా ఉంటుంది.
నమ్రత సోషల్ మీడియాలో ఎంత సందడి చేస్తుందో అందరికీ తెలిసిందే. మహేష్ బాబు చేసే అల్లరిని అభిమానులకు తెలిసేలా చేస్తుంది నమ్రత. రోజూ ఏదో ఒక పోస్ట్ పెడుతూ అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంటుంది. ఇక సితార, గౌతమ్ చేసే చిలిపి చేష్టలు, ముద్దు మాటలు, క్యూట్ క్యూట్ స్టెప్పులకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా సితార తీసిన ఓ ఫోటోను నమత్ర షేర్ చేసింది. అందులో మహేష్ బాబు నమత్రలను చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. మహేష్ బాబు పాతికేళ్ల కుర్రాడిలా ఉన్నాడు. చూడగానే ఏం అందంరా బాబు అని అనుకోక మానరు.
సితార తీసిన ఫోటోను నమత్ర షేర్ చేస్తూ.. ‘మన ఉనికికి మూలకారణం మన ప్రేమే అని నేను నమ్ముతున్నాను. ప్రేమ వల్లే మనం సంతోషంగా జీవించగలుగుతున్నాం. దయ, కరుణ అన్నీ ప్రేమ నుంచేఉత్పన్నమవుతాయి . అన్నింటికంటే ప్రేమే గొప్పది!! ఇది నా ఆలోచన, భావన !! కాబట్టి ప్రేమతో మెలగండి ఒకరికొకరు తోడుగా ఉండండి !!మనకుండేది ఒకే జీవితం’ అంటూ మహేష్ బాబుపై ఉన్న ప్రేమను వారి మధ్య ఉన్న బంధం గురించి నమ్రత ఎంతో గొప్పగా వివరించింది.