మహేశ్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘ఎస్‌ఎస్‌ఎంబి29’గా ఇది ప్రచారంలో ఉంది. ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తీసుకు రాబోతున్నారు. దీంతో ఈ సినిమాతోనే నేరుగా హిందీలో అడుగు పెట్టాలని నటుడు మహేశ్ బాబు భావిస్తున్నట్లు సమాచారం.
తాజాగా దీనికి సంబంధించిన ఓ వార్త సోషల్ విూడియాలో వైరల్‌గా మారింది. తన సినిమాల విషయంలో మహేశ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. రాజమౌళి ప్రాజెక్ట్‌తో మహేశ్ (Mahesh Babu) పాన్ వరల్డ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో బాలీవుడ్ వెండితెరపై ఈ సినిమాతోనే హిందీ ఆడియన్స్‌ను పలకరించాలని ఆయన ఫిక్స్ అయ్యారట. అందుకే ‘ఎస్‌ఎస్‌ఎంబి29’ విడుదలయ్యే వరకు తన గత చిత్రాలను హిందీలోకి డబ్ చేసి థియేటర్‌లలో రిలీజ్ చేయొద్దని నిర్మాతలను కోరినట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు మహేశ్ నేరుగా ఏ హిందీ సినిమాలోనూ నటించలేదు. దీంతో బాలీవుడ్‌లో ఇదే తన తొలి చిత్రమవుతుందని ఆసక్తిగా ఉన్నారు. అందుకే అక్కడి ఆడియన్స్‌ను అలరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచి అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు. పండగలకు, మూవీ యూనిట్‌లో వాళ్ల పుట్టిన రోజులకు దీని నుంచి ఏమైనా అప్‌డేట్ ఇస్తారేమో అని ఆశపడ్డారు.
అయితే రాజమౌళి మాత్రం సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని బయటకు రానీయకుండా జాగ్రత్త పడుతున్నారు. సినిమాలో ప్రతి సన్నివేశం పర్‌ఫెక్ట్‌గా వచ్చేంతవరకూ విశ్రమించని జక్కన్న.. ఈ ప్రాజెక్ట్ విషయంలో మరింత శ్రద్ధపెట్టారట.’ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం కాబట్టి ఆ అంచనాలను దృష్టిలో పెట్టుకునే ప్రతిదాన్ని ప్లాన్ చేస్తున్నారు. అందుకే ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా దగ్గరుండి చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. లోకేషన్స్, నటీనటుల ఎంపిక తదితర విషయాల్లో ఆయన ఎక్కడా రాజీ పడకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఈ కారణంతోనే సినిమా అప్‌డేట్స్ ఆలస్యమయ్యే అవకాశం ఉందని టాక్. ఈ ఏడాది చివరి నాటికి సినిమాకు సంబంధించిన పనులు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కొత్త సంవత్సరంలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక అప్‌డేట్ వెలువడుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. తన సినిమాల గురించి ప్రెస్ విూట్ పెట్టి అప్‌డేట్స్ ఇవ్వడం రాజమౌళికి అలవాటు. మహేశ్ మూవీ విషయంలోనూ ఇదే పద్ధతిని అనుసరించాలని భావిస్తున్నారు.