Home News మహేశ్ - త్రివిక్రమ్ సినిమా అనగానే ఎగిరి గంతేసి అడ్వాన్స్ లేకుండా సంతకం పెట్టేసిన టాప్...

మహేశ్ – త్రివిక్రమ్ సినిమా అనగానే ఎగిరి గంతేసి అడ్వాన్స్ లేకుండా సంతకం పెట్టేసిన టాప్ హీరోయిన్ ?

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో మరొక సినిమా రావాలని సినీ అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన గత చిత్రాలే (అతడు, ఖలేజా) నిదర్శనం. థియేటర్‌ టాక్‌, బాక్సాఫీస్‌ కలెక్షన్ల విషయానికి పక్కకు పెడితే ఇప్పటికీ ఆ రెండు చిత్రాలు టీవీల్లో వస్తే అందరూ టీవీలకు అతుక్కుపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అన్నీ కుదిరితే వీరిద్దరి కాంబినేషనలో మూడో చిత్రం రాబోతోందని తెలుస్తోంది.

ఇక త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో మూడో చిత్రం చేయాలని మహేశ్‌ సిద్దంగా ఉన్నట్లు సోషల్‌ మీడియాలో అనేక వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను త్రివిక్రమ్‌ ఇంటి నిర్మాణ సంస్థ హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ నిర్మించబోతోందని అనే టాక్‌ కూడా వచ్చింది. త్రివిక్రమ్‌ చెప్పిన స్టోరీ లైన్‌ నచ్చడం, మహేశ్‌ కోసం మాటల మాంత్రికుడు పూర్తి స్క్రిప్ట్‌ను కూడా సిద్దం చేసినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా మరో వార్త ఫిలింనగర్‌ సర్కిళ్లలో తెగ చక్కర్లు కొడుతోంది.
Shruthi | Telugu Rajyamఈ సినిమాలో మహేశ్‌కు జోడిగా నటించే హీరోయిన్‌ను త్రివిక్రమ్‌ ఫైనల్‌ చేశారట. ఆ టాప్‌ హీరోయిన్‌ ఎవరో కాదు శృతిహాసన్‌. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘శ్రీమంతుడు’ ఎలాంటి హిట్‌ అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతేకాకుండా అదిరిపోయే జంటగా కూడా కితాబు అందుకున్నారు. త్రివిక్రమ్‌-మహేశ్‌ చిత్రం అనగానే కనీసం కథ కూడా వినకుండానే ఓకే చెప్పిందని సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Mahesh And Shruthi | Telugu Rajyam
Mahesh And Shruthi Hasan | Telugu Rajyam‘అల.. వైకుంఠపురములో’ చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న త్రివిక్రమ్‌ తన తర్వాతి చిత్రం ఎన్టీఆర్‌తో ఉంటుందని ప్రకటించారు. అయితే దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌ చేస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర షూటింగ్‌ ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో ఈ గ్యాప్‌లో మహేశ్‌తో అతి తక్కువ సమయంలో సినిమా చేయాలని త్రివిక్రమ్‌ భావిస్తున్నారు. ఇక మరోవైపు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తర్వాత మహేశ్‌ బాబు పరుశురామ్‌ దర్వకత్వంలో ‘సర్కారు వారి పాట’ చిత్రం చేస్తున్నారు.
Mahesh Babu And Shruthi Hasan | Telugu Rajyam

- Advertisement -

Related Posts

షారుక్ మూవీ.. పాన్ ఇండియా ఇండియా అంటున్నారే

షారుక్ మూవీ.. పాన్ ఇండియా ఇండియా అంటున్నారే

అమ్మో హనుమ విహారి మామూలోడు కాదు , బిగ్ బాస్ 4 ఫ్యాన్స్ మనసులు కొల్లగొట్టాడు.

బిగ్ బాస్ అభిజీత్ కి ఇప్పుడు ఎంతటి క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా 2012లో విడుదలైన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాతో టాలీవుడ్...

రవితేజ ఫ్యాన్స్ మీసం మెలేస్తున్నారుగా ..!

రవితేజ చాలాకాలం తరువాత బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. 'క్రాక్' సినిమాతో సంక్రాంతి బరిలో దిగిన రవితేజ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాడు. వరసగా ఫ్లాప్స్ చూసిన రవితేజ ఈ సంక్రాంతి సీజన్ లో...

Latest News