గడిచిన కొన్నాళ్లలో టాలీవుడ్ సినిమా దగ్గర వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు చూసుకున్నట్టు అయితే ఆల్ మోస్ట్ చాలా వరకు భారీ మల్టీ స్టారర్ చిత్రాలు కనిపిస్తాయి. దీనితో మరిన్ని మల్టీ స్టారర్ లు చూడాలి అని మూవీ లవర్స్ కూడా కోరుకుంటున్నారు.
అయితే ఈ ట్రెండ్ లో ఓ క్రేజీ మల్టీ స్టారర్ కూడా పడుతుందా అనే టాక్ అయితే ఇప్పుడు మొదలైంది. ఇప్పట్లో సాధ్యం అవుతుందో లేదో కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో అయితే మల్టీ స్టారర్ పై నాని లేటెస్ట్ గా ఓపెన్ అవ్వడం వైరల్ గా మారింది.
తాను మహేష్ బాబు తో మల్టీ స్టారర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అయితే అయితే దీనిని దర్శకుడు త్రివిక్రమ్ తో చేస్తాను అన్నట్టుగా తాను హింట్ ఇవ్వడం ఇప్పుడు వైరల్ గా మారింది. నిజానికి గతంలో కూడా గుంటూరు కారం విషయంలో నాని ఓ ముఖ్య పాత్రలో నటిస్తాడు అని కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి.
దీనితో అప్పట్లోనే వచ్చిన రూమర్ మళ్లీ ఇపుడు ఇదే కాంబినేషన్ పై రావడం గమనార్హం. మరి సినిమాలో ట్విస్ట్ గా నాని కూడా ఏమన్నా కనిపిస్తాడో ఏమో చూడాలి. ఇక నాని హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “హాయ్ నాన్న” ఇప్పుడు రిలీజ్ కి సిద్ధంగా ఉండగా దీనిని కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించాడు అలాగే మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా ఈ డిసెంబర్ 7న సినిమా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతుంది.