Manchu Vishnu : వరుణ్ గని కోసం పోస్ట్ పెట్టిన మంచు విష్ణు…! మై బ్రదర్ అంటూ షాకిచ్చిన విష్ణు…!

Manchu Vishnu : మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు వరుణ్ తేజ్ కూడా ఒకరు. కానీ విభిన్నమైన పాత్రలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. వరుణ్ తేజ్ నటించిన చిత్రం గని, దానికి ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది కానీ కొన్ని కారణాల వల్ల విడుదలకు ఆలస్యం అవుతూ వస్తోంది. మొత్తానికి ఏప్రిల్ 8న ఈచిత్రం విడుదల నిర్ణయించారు.ఈ చిత్రం కోసం వరుణ్ విదేశాల్లో బాక్సింగ్ కోచింగ్ కూడా తీసుకున్నాడు.

ఈ సినిమాకు కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహించగా, అల్లు అరవింద్‌ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించారు.బాలీవుడ్ యంగ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడిగా నటించారు.తాజా ఈ సినిమాకు సంబంధించి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.మెగా కుటుంబం, మంచు కుటుంబం మధ్య మాటల వేడితో తరచూ మీడియాకెక్కుతుంటారు.అలాంటిది విష్ణు వరుణ్ తేజ్ సినిమా గురించి పోస్ట్ పెట్టడం అందరిని ఆశ్చర్యానికి గురించేస్తోంది.

‘మా’ ఎన్నికల సందర్భంగా నాగబాబు, మంచు విష్ణుల మధ్య మాటల యుద్ధం సాగిన విషయం తెలిసిందే. ఇటీవల మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలకు కూడా నాగబాబు ఇండైరెక్ట్‌గా కౌంటర్ ఇచ్చారు. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో వరుణ్ తేజ్‌కు మంచు విష్ణు విషెస్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది.ఆల్‌ ది బెస్ట్‌ మై బ్రదర్‌ వరుణ్‌ తేజ్‌. ఈ మూవీ గ్రాండ్‌ సక్సెస్‌ అవ్వాలని కోరుకుంటున్నా’ అంటూ ట్విట్టర్‌లో విష్ణు పోస్ట్ చేశాడు.