ఎస్ రాజ్ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ కృతి శెట్టి హీరో హీరోయిన్లు తెరకెక్కిన చిత్రం మా చెర్ల నియోజకవర్గం. ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో నితిన్ ఇదివరకు కనిపించని ఒక నిజాయితీగల పవర్ ఫుల్ ఐఏఎస్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఈనెల 12వ తేదీ ప్రేక్షకులు ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కూడా సాధించలేకపోయిందని చెప్పాలి.
ఇకపోతే ఈ సినిమా థియేటర్లో విడుదలై మంచి ఆదరణ సంపాదించకపోవడంతో డిజిటల్ మీడియాలో ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమెజాన్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా థియేటర్లో విడుదలైన నాలుగు వారాలకు అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాని సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అమెజాన్ లో ప్రసారం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇకపోతే త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో విడుదల తేదీ విషయం గురించి అమెజాన్ అధికారికంగా వెల్లడించునున్నట్లు సమాచారం.ఇక ఈ మధ్యకాలంలో నితిన్ వరుస సినిమాలు ఫ్లాప్ కావడంతో ఆయన అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో నటించిన కృతి శెట్టి సైతం వరుసగా రెండవ ఫ్లాప్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో వీరికి ఇబ్బందులలో పడే అవకాశాలు ఉన్నాయని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.