అక్కినేని హీరోకి మ‌హేష్ బాబు సాయం !

Mahesh Babu to play Sivaji role in Rajamouli's direction

అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కిస్తున్న చిత్రం ల‌వ్ స్టోరీ. ఏప్రిల్ 16న విడుద‌ల కానున్న ఈ చిత్రం జోరుగా ప్ర‌మోష‌నల్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. చిత్రం నుండి ఒక్కో సాంగ్ విడుద‌ల చేస్తూ అంచ‌నాలు పెంచుతున్న మేక‌ర్స్ తాజాగా ఏవో ఏవో కలలే… అంటూ సాగే పాటని మహేష్ బాబుతో విడుద‌ల చేయించారు. ఇప్పటిదాకా విడుదలైన ఈ సినిమాలోని ప్రతి పాట శ్రోతల్ని ఉర్రూతలూగించిగా, తాజాగా విడుద‌లైన వాన నేపథ్యంలో సాగే ‘ఏవో ఏవో కలలే…’ పాట కూడా రంజింప‌జేస్తుంది.

చైతూకు మ‌హేష్ సాయం.. థ్యాంక్స్ చెప్పిన అక్కినేని హీరో

త‌న చిత్రంకు సంబంధించిన సాంగ్ విడుద‌ల చేసినందుకు మ‌హేష్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసిన నాగ చైత‌న్య‌.. మ‌హర్షి సినిమాకు నేష‌న‌ల్ అవార్డ్ ద‌క్కినందుకు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు . కాగా చైతూ ప్ర‌స్తుతం విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో థ్యాంక్యూ అనే సినిమా చేస్తుండ‌గా, ఇందులో మహేష్ అభిమానిగా కనిపించి అల‌రించ‌నున్నాడు ఈ అక్కినేని హీరో.

ఇక ఈ సినిమాకు ఏర్పడ్డ హైప్ మేరకు ఈ సినిమా భారీ స్థాయిలో థియేట్రికల్ రైట్స్ అమ్మడు పోయినట్లు సమాచారం. ‘లవ్ స్టోరీ’ చిత్రానికి బిజినెస్ పరంగా మంచి ఫ్యాన్సీ ఆఫర్లు వస్తున్నాయట. ఈ చిత్రం థియేట్రికల్ హక్కులు సుమారు 30 కోట్లకు అమ్ముడుపోయిన్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు శాటిలైట్ అండ్ ఓవర్సీస్ రైట్స్ ఓ రేంజ్‌లో అమ్ముడుపోయాయని టాక్. ఈ సినిమా చైతన్య గత సినిమాలన్నింటికంటే భారీ ధర పలికిననట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ ఛానెల్ శాటిలైట్ రైట్స్ భారీ మొత్తాన్ని ఆఫర్ చేసిందట. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను భారీ ధరకు ఆహా దక్కించుకుందని తెలుస్తోంది.

Evo Evo Kalale Lyrical |  Lovestory Songs | Naga Chaitanya | Sai Pallavi | Sekhar Kammula | Pawan Ch