సెన్సార్ లో “దసరా” కి పెద్ద ఎత్తున అభ్యంతరాలు.?

Nani-Dasara-1200by667

ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లో తెలుగు సినిమాల హవా ఏ రేంజ్ లో నడుస్తుందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలా ఇప్పటికే ఎన్నో సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రాణించగా ఇప్పుడు మరో సినిమా అయితే సత్తా చాటేందుకు సిద్ధంగా ఉంది. ఆ సినిమానే “దసరా”. నాచురల్ స్టార్ నాని హీరోగా చేసిన మొదటి పాన్ ఇండియా సినిమా అయితే ఇది కాగా దీనిపై ఇప్పుడు సెన్సేషనల్ హైప్ నెలకొంది.

కాగా ఈ భారీ సినిమాలో కీర్తి సురేష్ నటించగా ఈ ఇద్దరినీ కూడా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డీ గ్లామరస్ గా మార్చేసి ఒక పక్కా నాటు ఏక్షన్ డ్రామాలా ప్లాన్ చేసాడు. అయితే ఆల్రెడీ సినిమాలో నాటు నేటివిటీ ఎలా ఉంటుందో అందరికీ టీజర్ ట్రైలర్ లతో అర్ధం అయ్యింది.

కాగా అందుకు తగ్గట్టు గానే సినిమాలో ఏక్షన్ సహా ఇతర అంశాలు గట్టిగానే ఉండగా లేటెస్ట్ గా సెన్సార్ టాక్ అన్నట్టుగా ఓ టాక్ ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. కాగా ఈ సినిమాని సెన్సార్ కి పంపగా ఈ సినిమాకి సెన్సార్ యూనిట్ వారు అయితే రికార్డు స్థాయిలో అభ్యంతరాలు చెప్పినట్టుగా తెలుస్తుంది.

ఈ సినిమాలో ఏకంగా 31 చోట్ల వారు కట్స్ చెప్పినట్టుగా లేటెస్ట్ గా సినీ వర్గాల్లో టాక్ దీనితో దసరా లో ఏ రేంజ్ లో రా కంటెంట్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. గతంలో ఇన్ని ఎక్కువ కట్స్ ఎప్పుడో టెంపర్ సినిమాకి వచ్చినట్టుగా గుర్తు మళ్ళీ సినిమాకి ఈ రేంజ్ లో వచ్చాయి. ఇక ఏఈ అవైటెడ్ సినిమా అయితే ఈ మార్చ్ 30 న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది.