లీకుల సమస్య ఈ మధ్య మరీ ఎక్కువైంది. ఎన్నో వందల కోట్లు పెట్టి తీస్తోన్న సినిమాలను లీకులు పట్టి పీడిస్తున్నాడు. మొన్నటికి మొన్న కేజీయఫ్ చాప్టర్ 2 టీజర్ ముందే లీకైపోయింది. భారతదేశం మొత్తం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక చిత్రానికి లీకుల దెబ్బ గట్టిగా తగిలిందంటే మిగతా వారి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలా చాప్టర్ 2 లీకవ్వడం, అనుకున్న దానికంటే ముందుగానే రిలీజ్ చేయడం అందరికీ తెలిసిందే.
అలాగే నిన్న రాత్రి మాస్టర్ సినిమా కూడా లీకైంది. విడులకు ఒక రెండు రోజులుందనగా ఇలా లీకవ్వడంతో దర్శన నిర్మాతలు షాక్ అయ్యారు. ఈ లీకుల బెడద ఇక ఎన్నాళ్లంటూ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ లీకులపై దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఎమోషనల్ అయ్యాడు. ఈ సినిమా వెనుక ఏడాదిన్నర కష్టం ఉందంటూ తన బాధను వెళ్లగక్కాడు. ఇలాంటి పెద్ద సినిమా లీకవ్వడం, భారీ అంచనాలున్న సినిమా ఇలా ముందే బయటకు రావడంతో అంతా షాక్అవుతున్నారు.
ఇది ఏడాదిన్నర పాటు పడుతున్న కష్టం.. అలా కష్టపడి మాస్టర్‌ను మీ ముందుకు తెస్తున్నాం.. మాకు తెలుసు అది మీరు థియేటర్‌లో చూసే ఎంజాయ్ చేస్తారు.. మీకు మాస్టర్ లీక్డ్ కాపీ లింక్ వస్తే షేర్ చేయకండి. దయచేసి షేర్ చేయకండి.. థ్యాంక్యూ ఆల్. లవ్యూ ఆల్. ఇంకా ఒక్క రోజే ఉంది మాస్టర్ సినిమా మీదే అంటూ తెగ ఎమోషనల్ అయ్యాడు. అయితే ఈ లింక్ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో ఎక్కడా కనిపించడం లేదు. ఒకటి రెండు మూడు సీన్లు మాత్రమే వచ్చాయని కొందరు అంటుంటే గంట పాటు సినిమా బయటకు వచ్చిందని ఇంకొందరు అంటున్నారు.