రజనీ కోసం లోకేశ్‌ కొత్త ప్రయోగం

’ఖైదీ’, ’మాస్టర్‌’, ’విక్రమ్‌’ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ . కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ క్రేజ్‌ సంపాదించుకున్న ఈ డైరెక్టర్‌ ప్రస్తుతం విజయ్‌ హీరోగా ’లియో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. లియో తర్వాత సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తో ఓ సినిమా చేయబోతున్నారు లోకేష్‌.

ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమమైన విషయాలు చెప్పారు లోకేష్‌. లోకేష్‌ కనకరాజ్‌ తన ప్రతి సినిమా కథకి ముడి పెడుతూ ’లోకేష్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌’ క్రియేట్‌ చేసిన సంగతి తెలిసింది. రజనీకాంత్‌తో చేయబోయే చిత్రం మాత్రం ఇందులో భాగంగా వుండదు. ఈ సినిమా కోసం చాలా కొత్త ప్రయోగం చేస్తున్నారట లోకేష్‌.

ఆ ప్రయోగం తనకి కూడా కొత్తదేనని, ఇలాంటి ఫార్మెట్‌ లో ఇండియన్‌ సినిమాలో ఇప్పటివరకూ ఏదీ రాలేదని, తన గత సినిమాలకి, రజనీకాంత్‌ సినిమాలకి .. ఇది పూర్తిగా కొత్తగా వుండే సినిమాని, ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో, ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో అనే ఆసక్తి తనలో వుందని చెప్పుకొచ్చారు లోకేష్‌. లియో విడుదలైన వారం రోజుల తర్వాత రజనీ సినిమా ప్రీప్రొడక్షన్‌ మొదలౌతుంది.