కృతి శెట్టి ప్రస్తుతం వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఉప్పెన సినిమాతో ఎంతో మంచి విజయాన్ని అందుకున్న ఈమె వరస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె హీరో రామ్ పోతినేని సరసన నటించిన ది వారియర్ సినిమా ఈనెల 14వ తేదీ విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇక విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు.
ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి శెట్టి డైరెక్టర్ లింగు స్వామి గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కృతి శెట్టి రామ్ మొదటిసారిగా తెలుగు తమిళ భాషలలో తెరకెక్కిన ది వారియర్ సినిమాలో నటించారు. ఈ క్రమంలోనే ఈమె మాతృభాష తుళు కావడంతో ఈమెకు తమిళం ఎంతో కష్టతరంగా అనిపించిందని వెల్లడించారు.తాను ఇదివరకే తెలుగు సినిమాలలో నటించడం వల్ల తెలుగు మాట్లాడటం వచ్చు అయితే లింగు స్వామి గారి తెలుగు తమిళ యాసను పోలి ఉండటం వల్ల తనకు ఒక ముక్క కూడా అర్థమయ్యేది కాదని ఈమె పేర్కొన్నారు.
ఈ విధంగా తమిళం అర్థం కాకపోవడంతో ఒక వారం రోజుల పాటు లింగుస్వామి గారు చెప్పేది అర్థం కాక ఎంతో ఇబ్బంది పడ్డానని కృతి శెట్టి పేర్కొన్నారు. అయితే హీరో రామ్ కి తమిళం ఎంతో స్పష్టంగా రావడం చేత డైరెక్టర్ గారు చెప్పేది హీరో రామ్ తనకు వివరించే వారని, అనంతరం లింగస్వామి గారి భాషకు తాను కూడా అలవాటు పడ్డానని ఈ సందర్భంగా కృతి శెట్టి డైరెక్టర్ గురించి తెలిపారు. ఇకపోతే ఈమె ఈ సినిమాలో రేడియో జాకీ పాత్ర ద్వారా సందడి చేయనున్నారు.