తమిళ బిగ్గెస్ట్ స్టార్ హీరోస్ లో ఒకడైన విజయ్ దళపతి హీరోగా త్రిష హీరోయిన్ గా ఇంకా బిగ్ స్టార్స్ సంజయ్ దత్ మరియు అర్జున్ సార్జా లాంటి స్టార్స్ కలయికలో దర్శకుడు లోకేష్ కనగ రాజ్ తెరకెక్కించిన భారీ మల్టీ స్టారర్ చిత్రమే “లియో”. కాగా ఈ సినిమాపై నెక్స్ట్ లెవెల్ హైప్ నెలకొనగా..
ఈ చిత్రం తెలుగు వెర్షన్ రిలీజ్ కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మాసివ్ చిత్రం తెలుగు రిలీజ్ విషయంలో నిన్న డిస్ట్రిబ్యూటర్ కి లాస్ట్ మినిట్ లో షాక్ తగిలింది. తెలుగులో “లియో” సినిమాని ఆ టైటిల్ తో విడుదల చేయడానికి వీలు లేదని తాను ఆల్రెడీ తెలుగులో ఈ టైటిల్ రిజిస్టర్ చేసుకున్నట్టుగా ఓ వ్యక్తి కోర్టుకెక్కాడు.
దీనితో తెలుగులో అంతా సడన్ గా మారిపోగా వెంటనే రంగంలోకి దిగిన నిర్మాత నాగవంశీ ఆ టైటిల్ విషయంలో కేసు వేసిన వ్యక్తికి భారీ మొత్తం చెల్లించి టైటిల్ తాను తీసుకున్నట్టుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. తాను ఈ టైటిల్ సెటిల్మెంట్ కోసం ఏకంగా 25 లక్షలు చెల్లించి ఆ టైటిల్ ని తీసుకున్నారట.
దీనితో ఫైనల్ గా మేటర్ సెటిల్ అయ్యి తెలుగులో రిలీజ్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా 19నే థియేటర్స్ లో రావడానికి రెడీ అయ్యింది అని సినీ వర్గాల్లో వినిపిస్తుంది. అయితే ఇది కేవలం తెలుగు వెర్షన్ లో మాత్రమే ఇలా జరగడం గమనార్హం. ఇంకా ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా 7 స్క్రీన్ స్టూడియోస్ వారు నిర్మాణం వహించారు.