ఈ ఏడాది ఇండియన్ సినిమా నుంచి వచ్చిన పలు భారీ హిట్ చిత్రాల్లో సౌత్ ఇండియా సినిమా నుంచి మెయిన్ గా తమిళ్ నుంచి కూడా పలు చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా వాటిలో హీరో విజయ్ నటించిన బిగ్గెస్ట్ అండ్ అవైటెడ్ చిత్రం “లియో” కూడా ఒకటి.
ఎన్నో అంచనాలు మధ్య వచ్చిన ఈ సినిమా తమిళ నాట ఒక రికార్డు బ్రేకింగ్ ఓపెనర్ గా నిలిచి వండర్స్ సెట్ చేసింది. మరి ఇప్పటివరకు 600 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఆల్ మోస్ట్ థియేటర్స్ లో రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఐతే ఈ సినిమా ఓటిటి రిలీజ్ విషయంలో ముందు నుంచి కూడా జస్ట్ నెల వ్యవధిలోనే వచ్చేస్తుంది అని రూమర్స్ ఉన్నాయి.
కాగా ఈ సినిమా హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది కానీ ఇంకా అందులో అయితే ఎలాంటి అలికిడి లేదు. నిజానికి ఈ చిత్రం ఈ నవంబర్ 20 లోపే వచ్చేయాలి బట్ ఇంకా నెట్ ఫ్లిక్స్ వారు డేట్ ని ఇంకా రివీల్ చేయలేదు. దీనితో లియో ఓటిటి విడుదల మరో వారానికి వాయిదా వేసినట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి.
మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. వస్తే సడెన్ అప్డేట్ లేదా వారం వాయిదా తర్వాతే నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా రావచ్చని సోషల్ మీడియాలో కూడా నడుస్తున్న టాక్. ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. అలాగే అనిరుద్ క్రేజీ మ్యూజిక్ ఈ చిత్రానికి అందించాడు.