వైరల్ : త్రిషపై దారుణమైన కామెంట్స్ చేసిన “లియో” నటుడు 

స్టార్ హీరోయిన్ త్రిష అంటే తెలియని సౌత్ ఇండియా ఆడియెన్స్ ఉండరు. తమిళ్ సహా తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన త్రిష కొంచెం గ్యాప్ తర్వాత అయితే తెలుగు ఆడియెన్స్ లేటెస్ట్ చిత్రం “లియో” తో పలకరించింది. కాగా ఈ చిత్రంలో విజయ్ హీరోగా నటించగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించాడు.

మరి ఈ సినిమా రిలీజ్ అయ్యి భారీ సక్సెస్ అయ్యింది. కానీ ఇప్పుడు షాకింగ్ గా ఈ సినిమాలో నటించిన ఓ ప్రముఖ నటుడు త్రిషపై దారుణమైన కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది. ఈ సినిమాలో తమిళ్ కి చెందిన సీనియర్ నటుడు మన్సూర్ అలీఖాన్ ని దర్శకుడు లోకేష్ చాలా ముఖ్యమైన పాత్రనే అందించాడు.

అయితే తాను ఈ సినిమా కోసం లోకేష్ తనని అప్రోచ్ అయ్యినపుడు తనకి ఈ సినిమాలో త్రిషను ని రేప్ చేసే సీన్స్ ఏమన్నా ఇస్తారేమో అనుకున్నాను కానీ కానీ తీరా చూస్తే అలాంటివి ఏవి లేవని మీడియా ముఖంగా తాను చెప్పడం షాకింగ్ గా మారింది. దీనితో ఇంత ఓపెన్ ఒక ఆడదాని పట్ల దారుణంగా మాట్లాడ్డం హేయమైనది అని దీనిని సమాజంలో ఎవరూ యాక్సెప్ట్ చేయకూడదు అని అనేక విమర్శలు మన్సూర్ అలీఖాన్ పై మొదలయ్యాయి.

అంతే కాకుండా త్రిష కూడా ఈ కామెంట్స్ పట్ల చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ అతనిపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా కోలీవుడ్ సినిమా ఇతర నటీనటులు దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలను ఖండించాడు. మొత్తానికి మాత్రం అతని కామెంట్స్ పట్ల కోలీవుడ్ లో పెద్ద సీరియస్ ఏక్షన్ పడేలా ఉందనే చెప్పాలి. 
https://x.com/trishtrashers/status/1725899644255781075?s=20