Lavanya thripati : ట్వీట్ తో మరోసారి అనుమానం రేపిన లావణ్య… గని కి ఆల్ ది బెస్ట్ చెప్పిన బ్యూటీ….!

Lavanya Thripati :హీరోయిన్ లావణ్య త్రిపాటి ఇంకా మెగా హీరో వరుణ్ తేజ్ కు మధ్య వున్నా రూమర్స్ గురించ్జి అందరికి తెలిసిందే.వరుణ్ తేజ్ హీరోగా చేసిన మిస్టర్ అంతరిక్షం సినిమా లో హీరోయిన్ గా చేసిన లావణ్య త్రిపాఠి. ఆ రెండు సినిమాలోని వీరి ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చూసి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పుకార్లు చక్కెర్లు కొట్టాయి. అది కాకుండా నిహారిక పెళ్లి కి లావణ్యత్రిపాఠి హాజరు కావడం అప్పట్లో ఈ పుకార్లకు బలం చేకూర్చింది.

వరుణ్ తేజ్ పుట్టిన రోజు పురస్కరించుకొని వీరిద్దరూ బెంగుళూరు వెళ్లడం ఆ ఫోటోలను సామాజిక మాద్యమం లో పంచుకోవడం తో మరోసారి పెరిగాయి.కానీ అప్పుడు లావణ్య డెహ్రాడూన్లో తన ఫ్యామిలీ తో వున్న ఫోటోలను షేర్ చేసి ఆ పుకార్లకు చెక్ పెట్టింది.తర్వాత చాలా రోజులుగా వీరి లవ్ ట్రాక్ కు సంబందించిన రూమర్స్ లేవు.కాని ఇప్పుడు మరోసారి వరుణ్ తేజ్ లావణ్య లవ్ ట్రాక్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం స్టార్ట్ అయ్యింది.

తాజాగా వరుణ్‌ తేజ్‌కి లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో స్పెషల్‌ విషెస్‌ తెలియజేసిందీ.దీంతో రూమర్స్ మళ్ళీ మొదలుఅయ్యాయి.వరుణ్ తేజ్ హీరో గా వస్తున్న గని సినిమా ఏప్రిల్ 8 న విడుదల అవుతుండటంతో లావణ్య వరుణ్ ని పొగుడుతూ స్పెషల్ విష్ చేసింది.వరుణ్‌.. ఈ పాత్ర కోసం నువ్వు 110 శాతం ఎఫర్ట్ పెట్టావని తెలుసు. నీతో పాటు నీ టీం చేసిన హార్డ్‌ వర్క్‌కి తగిన ప్రతిఫలం దక్కాలని ప్రార్థిస్తున్నా అంటూ ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట్లో ఫుల్ వైరల్ అవుతుంది. మరి ఇప్పుడైనా ఎవరైనా ఒకరు ఈ రూమర్స్ పై స్పందిస్తారేమో చూడాలి.