హుమ్..”గేమ్ చేంజర్” సాంగ్ కోసం అప్పుడు వరకు ఆగాల్సిందేనా 

టాలీవుడ్ గ్లోబల్ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు చేస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం “గేమ్ చేంజర్” కోసం అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్రం నుంచి ఫ్యాన్స్ ఎప్పుడు నుంచో కోరుకుంటున్న ఒకే ఒక్క కోరిక సినిమా మొదటి సాంగ్ కోసం కోసం.

మరి ఇది లీక్ అవ్వడంతో వెంటనే మేకర్స్ అనౌన్స్ చేసేసారు కానీ మళ్ళీ లాస్ట్ మినిట్ లో శంకర్ షాకివ్వడంతో అంతా నిరాశ పడ్డారు. మరి ఈ సాంగ్ ఎప్పుడు అనేది మళ్ళీ అఫీషియల్ క్లారిటీ అయితే ఇవ్వలేదు కానీ త్వరలోనే అంటూ ట్విస్ట్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఈ సాంగ్ ఎప్పుడు రావొచ్చు అంటే లేటెస్ట్ బజ్ సినీ వర్గాల్లో వినిపిస్తుంది.

దీనితో అయితే ఈ అవైటెడ్ సాంగ్ ని మేకర్స్ ఈ రానున్న క్రిస్మస్ కానుకగా వదిలే ఛాన్స్ ఉందని ఇప్పుడు గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో తెలీని అయోమయ పరిస్థితిలో ఫ్యాన్స్ ఉన్నారు. ఇక దానికి తోడు సినిమా పాటలు కూడా వాయిదా వేస్తూ వస్తుండడంతో అయితే ఫ్యాన్స్ లో ఉత్సాహం మరింత తగ్గిపోతుంది.

మరి ఈ సాంగ్ అప్పుడైనా వస్తుందో లేదో చూడాలి. కాగా ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే అంజలి కూడా మరో హీరోయిన్ గా నటిస్తుండగా ఏస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని తమ బ్యానర్ లో 50వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తున్నాడు.