గేమ్ చేంజెర్ మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్..జక్కన్న చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్!

తమిళ దర్శకుడు శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెలుగులో డైరెక్ట్ గా తీస్తున్న సినిమా గేమ్ చేంజర్. సంక్రాంతి స్పెషల్‌గా రాబోతోన్న ‘గేమ్ చేంజర్’ మూవీ ట్రైలర్ విడుదల వివరాలు వచ్చేశాయి. ఎప్పుడెప్పుడు ట్రైలర్ విడుదల చేస్తారా? అని ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ మధ్య ఓ అభిమాని అయితే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ లేఖను కూడా విడుదల చేశారు.

అలాంటి డైహార్డ్ ఫ్యాన్స్ కోసం చిత్ర యూనిట్ ‘గేమ్ చేంజర్’ ట్రైలర్ విడుదలకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించింది. గేమ్ ఛేంజర్ ట్రైలర్ జనవరి 2 సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు రానుంది.గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రాజమౌళి ముఖ్య అతిథిగా రానున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించారు. అయితే తాజాగా తమ ఎక్స్ అకౌంట్ ద్వారా హైదరాబాద్ లో జరగనున్న ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్టుగా అతడు రాబోతున్నాడు.

“డ్రమ్ రోల్ ప్లీజ్.. జనవరి 2న జరగనున్న గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వన్ అండ్ ఓన్లీ రాజమౌళి కళ్లు చెదిర ఎంట్రీ ఇవ్వబోతున్నారు. రేపు సాయంత్రం 5.04 గంటలకు కలుద్దాం” అనే క్యాప్షన్ తో మేకర్స్ ట్వీట్ చేశారు.రాజమౌళి చేతుల మీదుగా ఈ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. గతంలో రాజమౌళి దర్శకత్వంలో చరణ్ మగధీర, RRR సినిమాలు చేసి భారీ హిట్స్ కొట్టిన సంగతి తెలిసిందే.

దీంతో ఫ్యాన్స్ ఈ ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ట్రైలర్ లో చరణ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ లాంచ్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మేకర్స్.. ప్రీరిలీజ్ ఈవెంట్ మాత్రం రాజమండ్రిలో నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వస్తుండటంతో మరింత ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా జనవరి 10న విడుదలవుతున్న సంగతి అందరికీ తెలిసిందే.