మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ బ్లాక్ బస్టర్ పక్కా .. టీజర్ చూస్తే బ్లైండ్ గా ఫిక్సవ్వాల్సిందే ..!

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ గా అఖిల్ అక్కినేని భారీ హిట్ కొట్టాడానికి రెడీ అయ్యాడు. ఇప్పటి వరకు మూడు సినిమాలతో హీరోగా తనేంటో నిరూపించుకున్నాడు అఖిల్. ఇక బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ తో భారీ కమర్షియల్ సక్సస్ కొట్టి తనకంటూ ఒక సపరేట్ మార్కెట్ క్రియోట్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అది ఈ సారి పక్కా అని తాజాగా రిలీజైన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ రొమాంటిక్ టీజర్ చూస్తే ఫ్యాన్స్ కాదు ఎవరైనా బ్లైండ్ గా ఫిక్సవ్వాల్సిందే.

New poster of Most Eligible Bachelor featuring Akhil Akkineni, Pooja Hegde  out - regional movies - Hindustan Times

ఇప్పటి వరకు చేసిన మూడు సినిమాలకంటే కంప్లీట్ డిఫ్రెంట్ గా కనిపిస్తున్నాడు అఖిల్. ఇక పూజా హెగ్డే క్యూట్ లుక్స్ సినిమాకి అడిషనల్ అట్రాక్షన్ గా కనిపిస్తున్నాయి. ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ పై అల్లు అరవింద్ సమరణలో బన్ని వాసు, వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందన్న నమ్మంతో చిత్ర యూనిట్ ఉన్నారు. నాగార్జున కూడా ఈ సినిమా రష్ చూసి సినిమా సూపర్ హిట్ అని జడ్జ్ చేసేశారు.

Image

ఇక ఈ సినిమాని సంక్రాంతి బరిలో దింపేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. భారీ సినిమాల మధ్య ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ని దింపాలని డిసైడయ్యారంటే అఖిల్ మొదటి బ్లాక్ బస్టర్ ఖాయమని అర్థమవుతోంది. ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం లో సినిమా చేయనున్న సంగతి తెలిసందే.

 

Most Eligible Bachelor Teaser | Akhil Akkineni, Pooja Hegde | Bommarillu Baskar | #MEBTeaser