లేటెస్ట్ : SSMB 28 పై అదిరే అప్డేట్ తో క్రేజీ హింట్ ఇచ్చిన మేకర్స్.!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ గత కొంత కాలం నుంచి కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం దర్శకుడు త్రివిక్రమ్ తో మహేష్ చేస్తున్న హ్యాట్రిక్ సినిమా అలాగే మహేష్ కెరీర్ లో 28వ సినిమా కోసమే అని చెప్పాలి.

కాగా ఈ చిత్రం నుంచి అయితే ఈ మే 31న సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా అయితే సినిమా టైటిల్ సహా మాస్ గ్లింప్స్ ని కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేయగా ఇప్పుడు దీనిపై మేకర్స్ అదిరే అప్డేట్ ని ఇచ్చేసారు.

మరి అఫీషియల్ గా ఈ మే 31న ముందు మేము చెప్పినట్టుగా ఈ గ్లింప్స్ ని తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున థియేటర్స్ లో స్క్రీనింగ్ కి తీసుకొస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అంతే కాకుండా ఈ అప్డేట్ పై డిజైన్ పోస్టర్ చూసినట్టు అయితే సినిమా టైటిల్ పై కూడా హింట్ ఇచ్చేసారు.

గత కొన్ని రోజులు నుంచి స్ప్రెడ్ అవుతున్న మాస్ టైటిల్ “గుంటూరు కారం” టైటిల్ నే కన్ఫర్మ్ అన్నట్టుగా ఆ పోస్టర్ లో గాల్లో ఎగురుతున్న ఎర్ర కారం మిర్చి చూస్తే అర్ధం అయిపోతుంది. సో ఈ క్రేజీ హింట్ తో అయితే ఈ సినిమా టైటిల్ “గుంటూరు కారం” లేదా “గుంటూరు మిర్చి” అనే టైటిల్స్ లో ఒకటి ఫిక్స్ అని చెప్పొచ్చు.

మొత్తానికి సూపర్ ఫ్యాన్స్ కి కావాల్సిన సూపర్ మాస్ అప్డేట్ అయితే ఇప్పుడు వచ్చేసింది అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీ లీల లు హీరోయిన్స్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.