లేటెస్ట్ : పవన్ ఫ్యాన్స్ కి షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన “ఓజి” మేకర్స్.!

ప్రెజెంట్ టాలీవుడ్ లో భారీ హైప్ లో ఉన్న పలు చిత్రాల్లో దర్శకుడు సుజీత్ మరియు టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న మాసివ్ చిత్రం “ఓజి” కూడా ఒకటి. మరి కెరీర్ కెరీర్ లో భారీ యాక్షన్ అండ్ బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా దీనిని తెరకెక్కిస్తుండగా.

చాలా క్రేజీ అంశాలతో దీనిని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే కానుకగా భారీ ట్రీట్ ని మేకర్స్ ఇస్తున్నట్టుగా ఇది వరకే కన్ఫర్మ్ చేశారు. ఇంతే కాకుండా నిన్న కూడా సినిమా నుంచి మీరు ఊహించని అప్డేట్ తో అన్నీ పేల్తాయ్ అని కన్ఫర్మ్ చేశారు.

కాగా ఇపుడు అయితే మరో బిగ్ అప్డేట్ ని మేకర్స్ అందించారు.. కాగా ఈ అప్డేట్ తో అయితే మరోసారి మాసివ్ హైప్ ని అందించారు. కానీ ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ కి ఊహించని ట్విస్ట్ కూడా అందించారు. ఈ సెప్టెంబర్ 2న అయితే పవన్ ఫస్ట్ లోక్ ని రిలీజ్ చెయ్యట్లేదు అని కన్ఫర్మ్ చేశారు. ఇది డిజప్పాయింటింగ్ అంశం కాగా ఇది కాకుండా అయితే సినిమా నుంచి క్రేజీ ట్రీట్ వీడియోలో వస్తుంది అని తెలిపారు.

అంతే కాకుండా ఆకలి మీద ఉన్న చిరుత వేట ఎలా ఉంటుందో చూస్తారు అన్నట్టుగా కూడా తెలిపి క్రేజీ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మరి ఇందులో పవన్ చేయి అందులో పిస్టల్ ఇంకా చేతి మీద జాపనీస్ లో ఓ టాటూ కేజ్రీగా ఉన్నాయి. దీనితో ఈ సెప్టెంబర్ 2న ఫ్యాన్స్ కి గట్టి ట్రీట్ ఉంటుంది అని కన్ఫర్మ్ అయ్యింది. మరి ఆరోజు డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఇచ్చే మాసివ్ బొనాంజా ఎలా ఉంటుందో చూడాలని అంతావెయిట్ చేస్తున్నారు.