లేటెస్ట్ – “దేవర” వాయిదా?? క్లారిటీ ఇచ్చేసిన మేకర్స్ 

ఇప్పుడు తెలుగు సినిమా నుంచి రాబోతున్న పలు భారీ చిత్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివతో చేస్తున్న మాసివ్ చిత్రం “దేవర” కూడా ఒకటి. కాగా ఈ భారీ చిత్రాన్ని హాలీవుడ్ లెవెల్ హంగులతో తెరకెక్కిస్తున్నట్టుగా రీసెంట్ గా వచ్చిన గ్లింప్స్ చూస్తేనే అందరికీ అర్ధం అవుతుంది.

దీనితో దేవర తో ఎన్టీఆర్ ఒక మాస్ హిస్టీరియా చూపిస్తాడు అని అంతా ఫిక్స్ అయ్యి సినిమా రిలీజ్ కోసం చూస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ గ్యాప్ లో సినిమా వాయిదా అంటూ పలు రూమర్స్ బయటకి వచ్చాయి.. కాదు స్ప్రెడ్ చేసారు. సో దీనిపై దేవర యూనిట్ అయ్యితే స్పందించింది.

దేవర పార్ట్ 1 రిలీజ్ లో ఎలాంటి మార్పు లేదని అనుకున్నట్టుగా ఏప్రిల్ 5నే రిలీజ్ చేస్తున్నామని రిప్లై ఇచ్చారు. సో దేవర పై ట్రై చేసిన ఫేక్ వార్తలు వర్క్ అవ్వలేదని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతుంది.

అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కూడా ఈ సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నాడు. ఇక సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. కాగా ఎన్టీఆర్ ఆర్ట్స్, కొత్త నిర్మాణ సంస్థ యువసుధ ఆర్ట్స్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.