ఓటిటి : థ్రిల్లర్ “యశోద” డిజిటల్ రిలీజ్ పై బిగ్ అప్డేట్.!

ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ కూడా మంచి మార్కెట్ ఉన్నటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో టాలెంటెడ్ హీరోయిన్ సమంత ప్రభు కూడా ఒకరు. మరి సమంత అయితే ఇప్పుడు హీరోయిన్ గా కన్నా లీడ్ రోల్ లోనే ఎక్కువగా చేస్తున్న సినిమాలు ఉండగా వాటిలో లేటెస్ట్ గా వచ్చి భారీ సక్సెస్ అందుకున్న చిత్రం “యశోద” కూడా ఒకటి.

మరి ఈ చిత్రంని అయితే దర్శకుడు హరి మరియు హరీష్ లు తెరకెక్కించగా భారీ వసూళ్లు కూడా ఈ చిత్రం నమోదు చేసింది. థియేటర్స్ లో ఉన్నది తక్కువ కాలమే అయితే ఆ ఉన్న కొన్ని రోజుల్లో ఈ చిత్రం ఏకంగా 35 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా అయితే అప్పుడే ఓటిటి లో కూడా సందడి చేసేందుకు సిద్ధం అయ్యింది. మరి ఈ సినిమా డిజిటల్ పార్ట్నర్ గా అమేజాన్ ప్రైమ్ వీడియో లాక్ కాగా వీరు ఇపుడు ఈ సినిమా డిజిటల్ రిలీజ్ పై బిగ్ అప్డేట్ ని అందించారు. మరి ఈ సినిమా అయితే లేటెస్ట్ గా ఈ డిసెంబర్ 9 నుంచే స్ట్రీమింగ్ కి రానున్నట్టు వారు తెలిపారు.

మరి ఈ చిత్రం తెలుగు తమిళ్ సహా హిందీ మరియు మలయాళ కన్నడ భాషల్లో అమేజాన్ ప్రైమ్ లో రానున్నట్టు కూడా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ ఇంటెన్స్ థ్రిల్లర్ కి ఫైనల్ గా ఓ డేట్ వచ్చేసింది. ఇది ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మరి ఈ సినిమాకి అయితే మణిశర్మ సంగీతం అందించగా శ్రీదేవి మూవీస్ వారు మంచి బడ్జెట్ తో సినిమాని నిర్మాణం వహించారు.