Un stoppable 4: అన్ స్టాపబుల్ సీజన్ 4 లాస్ట్ గెస్ట్ గా గ్లోబల్ స్టార్… దద్దరిల్లి పోవాల్సిందే!

Un stoppable 4: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఒకవైపు సినిమాల ద్వారా వరుసగా అవకాశాలను అందుకుంటున్న బాలయ్య మరోవైపు రాజకీయాలలో కూడా కొనసాగుతూ మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా రాజకీయాలలో కూడా ఈయన ఎమ్మెల్యేగా మూడుసార్లు పోటీ చేసి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇలా హీరోగా ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నటువంటి ఈయన అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

ఇక అన్ స్టాపబుల్ కార్యక్రమం ప్రస్తుతం నాలుగవ సీజన్ ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమానికి ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు సినిమా సెలబ్రిటీలకు కూడా హాజరయ్యారు. ఇక త్వరలోనే ఈ కార్యక్రమంలో విక్టరీ వెంకటేష్ పాల్గొనబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఎపిసోడ్ డిసెంబర్ 27వ తేదీ ప్రసారం కాబోతుంది.

ఇక ఈ కార్యక్రమంలో చివరి ఎపిసోడ్ లో భాగంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పాల్గొనబోతున్నారని తెలుస్తుంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రాంచరణ్ ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రమోషన్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ సైతం బాలకృష్ణ అన్ స్టాపబుల్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని తెలుస్తుంది.

ఇక ఈ సీజన్లో ఇదే చివరి ఎపిసోడ్ అని తెలుస్తోంది. ఇలా బాలకృష్ణ టాక్ షోలో చరణ్ పాల్గొనబోతున్నారని తెలిసిన అభిమానులు సందడి చేస్తున్నారు. మరి ఈ షోలో తప్పనిసరిగా తన తండ్రి చిరంజీవి గురించి అలాగే తన బాబాయ్ పవన్ కళ్యాణ్ గురించి తప్పనిసరిగా బాలకృష్ణ ప్రశ్నలు అడిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక వీరి కాంబినేషన్లో రాబోతున్న ఎపిసోడ్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఎదురుచూస్తున్నారు.