సినిమాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న లేడీ సూపర్ స్టార్.. ఆందోళనలో అభిమానులు?

సౌత్ ఇండస్ట్రీ లేడీ సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార గత రెండు దశాబ్దాల నుంచి సౌత్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా సౌత్ ఇండస్ట్రీలో అగ్రత ఓ వెలుగు వెలుగుతున్నటువంటి నయనతార జూన్ 9వ తేదీ దర్శకుడు విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక ఈమె పెళ్లి సమయంలో నయనతార ఇకపై సినిమాలలో నటించదని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను కొట్టి పారేస్తూ నయనతార జవాన్ సినిమాలో నటిస్తున్నారు.

ఇలా ఈమె అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ సరసన జవాన్ సినిమాలో నటిస్తుండడంతో అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈమె తిరిగి సినిమాలలో నటిస్తుందని భావించారు.ఈ విధంగా ఈ సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్న నయనతార కాస్త విరావం దొరకడంతో తన భర్తతో కలిసి హాలిడే వెకేషన్ లో ఉన్నారు. తాజాగా నయనతారకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నయనతార జవాన్ సినిమా పూర్తి అయిన తర్వాత ఇకపై ఎలాంటి సినిమాలలో నటించదని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇక ఈమె పూర్తిగా ఇండస్ట్రీకి దూరమై ఇప్పటివరకు తాను సంపాదించిన డబ్బుతో వ్యాపారాలను ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఇలా వ్యాపార రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ప్రముఖ వ్యాపారవేత్తగా కొనసాగాలని నయనతార ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.ఈ విధంగా సినిమాల విషయంలో నయనతార షాకింగ్ డెసిషన్ తీసుకోవడంతో అభిమానుల సైతం ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపై నయనతారను మనం వెండితెరపై చూడలేమా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అయితే నయనతార గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈ వార్తలపై నయనతార లేదా విగ్నేష్ స్పందించాల్సి ఉంది.